కోలీవుడ్ కి లాస్ట్ ఛాన్స్.. మరి కూలీ సాధించేనా..?

Rajinikanth’s Latest Movie Coolie: టాలీవుడ్, బాలీవుడ్ లో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. శాండిల్ వుడ్ కు కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఉంది కానీ.. కోలీవుడ్ కు మాత్రం ఇంత వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటీ లేదు. ఇప్పుడు కోలీవుడ్ మూవీ కూలీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. కోలీవుడ్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని.. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయకపోతే.. ఇక ఎప్పటికీ సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. టాలీవుడ్ లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల ఎన్ని ఉన్నాయి..? కోలీవుడ్ కు కూలీ ఈ రికార్డ్ ను అందిస్తుందా..? లేదా..?

బాహబలి సినిమా ఓ సంచలనం. ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే ఒక కథను రెండు పార్టులుగా చెప్పచ్చు అని తెలియచేసి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. బాహుబలి 2 సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప 2 చిత్రాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించాయి. టాలీవుడ్ కు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు నాలుగు ఉన్నాయి. ఈ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాయి. అయితే.. కోలీవుడ్ ఈ ఫీడ్ సాధించేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది కానీ వర్కవుట్ అవ్వడం లేదు.

బాహుబలి స్పూర్తితో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించారు. అయితే.. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సూర్య కంగువ అంటూ బాహుబలి రేంజ్ లో భారీగా ఖర్చుపెట్టి సినిమా తీసాడు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేరు. ఆయన తీసిన భారతీయుడు, భారతీయుడు 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయి. కోలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయితే.. 500 నుంచి 800 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తున్నాయి కానీ.. 1000 కోట్లును మాత్రం అందుకోలేకపోతున్నాయి. Rajinikanth’s Latest Movie Coolie.

ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాకి లోకేష్‌ కనకరాజ్ డైరెక్టర్. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటించడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఈసారి కూలీ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్లు సినిమాని అందిస్తుందనే నమ్మకం ఇండస్ట్రీ జనాల్లో కలిగించింది. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళుతున్నారు. మిగిలిన కోలీవుడ్ హీరోల సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ లేదు. అందుచేత కోలీవుడ్ కి కూలీనే లాస్ట్ ఛాన్స్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. కూలీ 1000 కోట్లు అందిస్తుందో లేదో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/vijay-devarakonda-feel-tensed-about-his-kingdom-movie-release-which-is-made-with-the-srilankan-background/