
War 2 Rights: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తోన్న వార్ 2 సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి త్రివిక్రమ్ తో భారీ మైథలాజికల్ మూవీని పట్టాలెక్కించనున్నారు. దీనికి నాగవంశీ నిర్మాత. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ మూవీతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రిస్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎన్టీఆర్ సినిమా ఏంటి..? నాగవంశీ చేస్తోన్న రిస్క్ ఏంటి.?
ఎన్టీఆర్ నటిస్తోన్న వార్ 2 మూవీని ఆగష్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ టీజర్ ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు అనేది వాస్తవం. ఎన్టీఆర్ లుక్, స్టంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి కానీ.. యంగ్ టైగర్ అభిమానుల అంచనాలును మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేయాలి అనుకుంది యశ్ రాజ్ ఫిల్మ్స్. అయితే.. నిర్మాత నాగవంశీ వార్ 2 థియేట్రికల్ రైట్స్ కోసం భారీ మొత్తం ఆఫర్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయనకు రైట్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ 100 కోట్లు అడిగారట. అయితే.. నాగవంశీ 80 కోట్లు ఇస్తాన్నారని.. ముందు నో చెప్పినా.. ఫైనల్ గా నాగవంశీకి వార్ 2 రైట్స్ ఇచ్చారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నాగవంశీ రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. రిస్క్ అనే టాక్ రావడానికి కారణం ఏంటంటే.. ఇటీవల రిలీజ్ చేసిన వార్ 2 టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ లుక్ బాగున్నప్పటికీ.. పెద్దగా హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. పైగా బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీసుంటాడనే నమ్మకం కలగడం లేదు. అందుకనే రిస్క్ అనే మాట వినిపిస్తోంది. War 2 Rights.
మరో వైపు అదే రోజున వస్తున్న కూలీ సినిమా పై భారీగా బజ్ ఉంది. ఈ సినిమా నుంచి సరైన కంటెంట్ రిలీజ్ చేయకుండానే వావ్ అనిపించేలా క్రేజ్ ఉండడంతో వార్ 2 కనుక నిజంగానే అదే రోజు వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎఫెప్ట్ పడడం ఖాయం. దీనిని బట్టే నాగవంశీ పెద్ద సాహసమే చేస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే.. నాగవంశీకి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో…? ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో..? బాగా తెలుసు. దీంతో వార్ 2 నాగవంశీ నమ్మకాన్ని నిజం చేస్తుందా..? లేదా..? ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరనుందో తెలియాలంటే ఆగష్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.