హీరోగా ఎంట్రీ ఇస్తున్న నాగభూషణం మనవడు

Missterious Movie దివంగత నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘మిస్టీరియస్’ చిత్రం ద్వారా అబిద్ హీరోగా మారుతున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉష, శివాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మూవీ టీమ్ లాంచ్ చేసింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తాజాగా టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌తో సినిమా సక్సెస్‌పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది’’ అని చెప్పారు. నిర్మాతలు ఉష, శివాని మాట్లాడుతూ.. ‘‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాం’’ అని తెలిపారు. ఇక సినిమాలో జంటగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ ‘‘ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కి చాలా థాంక్స్. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు టీజర్‌కి కూడా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.Missterious Movie