
టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో హీరోగా నటించే కొత్త సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో క్లారిటీ లేదు. ఇదిగో నాగార్జున కొత్త సినిమా అప్ డేట్.. అదిగో నాగార్జున కొత్త సినిమా అప్ డేట్ అంటూ మీడియాలో ప్రచారం జరగడం తప్పా.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. కుబేర మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగ్ అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ.. నాగ్ ఏం చెప్పారు..? కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?
నాగ్ కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే.. సరైన కథ ఎవరూ చెప్పకపోవడమే. ఇప్పటికే నాగార్జున దాదాపు 100 సినిమాల దగ్గరకు చేరుకున్నారు. అంటే.. దాదాపు ఓ వంద క్యారెక్టర్స్ లో నటించేసారు. ఈమధ్య తనకు ఎవరు కథ చెప్పినా.. అది ఇంతకు ముందు నటించేసిన క్యారెక్టరే అనిపించడంతో ఆ కథలకు ఓకే చెప్పలేదట. అయితే.. శేఖర్ కమ్ముల కుబేర కథలో తన క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉండడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పారట నాగార్జున. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ తెలియచేశారు.
నా సామి రంగ సినిమా తర్వాత నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఎవరితోనూ నాగ్ మూవీ సెట్ కాలేదు. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ నాగ్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడని.. త్వరలోనే ఈ కథకు సంబంధించి నాగ్ ఫైనల్ డిషిషన్ తీసుకోనున్నారని సమాచారం. సీనియర్ హీరోలతో సినిమాలు చేయాలంటే.. యంగ్ డైరెక్టర్ కాస్త కష్టమే. ఎందుకంటే.. ఇప్పటికే ఈ సీనియర్స్ రకరకాల కథలతో.. డిఫరెంట్ గెటప్స్ తో సినిమాలు చేసి మెప్పించారు.
ఇప్పుడు ఈ సీనియర్ హీరోలను మెప్పించాలంటే.. కథ పై చాలా కసరత్తు చేయాలి. కొత్త పాయింట్ అయ్యుండాలి. నాగ్ కూడా ఎంత లేట్ అయినా ఫరవాలేదు.. ఈసారి సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సాధించాలని చూస్తున్నాడు. అఖిల్ మ్యారేజ్ అయిపోవడంతో ఇప్పుడు నాగ్ తన సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఓ వైపు కుబేర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగ్.. నెక్ట్స్ బిగ్ బాస్ 9 వర్క్ లో బిజీ కానున్నారు. ఆతర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన కూలీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. మరి.. నాగ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే.. పుట్టినరోజైన ఆగష్టు 29న అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది. మరి.. నాగ్ ని మెప్పించే డైరెక్టర్ ఎవరో.. ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆగష్టు 29 వరకు ఆగాల్సిందే.