
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జునల క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ, క్రేజీ మల్టీస్టారర్ కూలీ. ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. రోజురోజుకు ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరుగుతున్నాయి. అయితే.. ఈ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ భారీగా ఏర్పడింది. ఇంతకీ.. ఎవరెవరు పోటీపడ్డారు..? నాగ్ కూలీ రైట్స్ దక్కించుకోవడం నిజమేనా…?
కూలీ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ మామూలుగా లేదు. యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూలీ రైట్స్ కోసం ఏకంగా 45 కోట్లు ఆఫర్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కూలీ రైట్స్ కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరితో పాటు ఏసియన్ సునీల్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ భారీ పాన్ ఇండియా మూవీ రైట్స్ కోసం పోటీపడుతున్నాయి. అయితే.. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కూలీ రైట్స్ కోసం పోటీపడడం విశేషం.
అయితే.. ఇంత పోటీలో కూలీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ఎవరు దక్కించకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు కూలీ రైట్స్ కింగ్ నాగార్జున సొంతం చేసుకున్నారని.. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ క్రేజీ మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రజినీ, నాగ్ క్రేజీ కాంబో మూవీ కావడం.. ఈ భారీ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించడం.. రోజురోజుకు అంచనాలు పెరుగుతుండడం.. దీనికి తోడు నాగ్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 14న కూలీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మరి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూలీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.