
అక్కినేని నాగార్జున, అక్కినేని అఖిల్.. రియల్ లైఫ్ లో తండ్రీకొడుకులైన ఈ ఇద్దరూ రీల్ లైఫ్ లో కూడా తండ్రీకొడుకులుగా నటించనున్నారా..? అంటే.. అవుననే అంటున్నారు సినీ జనాలు. ఈ వార్త లీకైనప్పటి నుంచి అభిమానులు అఫిషియల్ అప్ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ.. వీరిద్దరూ ఏ సినిమాలో నటిస్తున్నారు..? క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి..? ఈ క్రేజీ మూవీ అప్ డేట్ ఏంటి..?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇది రాయలసీమలోని చిత్తూరు బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న సినిమా. ఆమధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం అఖిల్ చిత్తూరు యాస నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు అఖిల్ నటించిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు అనేట్టుగా కథను డిజైన్ చేశారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. అది అఖిల్ పాత్రకు తండ్రి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో నటించేందుకు నాగార్జున ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, అఖిల్.. తెర పై కూడా తండ్రీకొడుకులుగా నటించనట్టు అవుతుంది. అయితే.. ఇది నిజమా..? కాదా..? అనేది క్లారిటీ రావాల్సివుంది. ఇందులో అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా కథకు డివోషనల్ టచ్ ఉండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇక ఈ లెనిన్ మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. ఇటీవల పెళ్లి చేసుకున్న అఖిల్ త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం. తాజా షెడ్యూల్ ను తిరుపతిలో ప్లాన్ చేశారని తెలిసింది. నాగార్జున, చైతన్య నటించిన మనం సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ కనిపించడం.. అది సినిమాకే హైలెట్ గా మారడం తెలిసిందే. అలాగే అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ లో ఓ సాంగ్ లో నాగార్జున కనిపిస్తారు. ఇప్పుడు నాగ్, అఖిల్ తండ్రీకొడుకులుగా నటించబోతున్నారని వార్తలు వస్తుండడం తో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో లెనిన్ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రేజీ మూవీని నవంబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారని టాక్.