
Kuberaa Censor Report: టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కుబేర. దీనికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసిప్పుడు ఎలా ఉంటుందో అనే డౌట్స్ ఉండేవి. అయితే.. టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇందులో బలమైన కథ, కథనం ఉన్నాయనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. ఈ నెల 20న కుబేర భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇటీవల కుబేర సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి.. కుబేర మూవీకి సెన్సార్ బోర్డ్ ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చింది..? రన్ టైమ్ ఎంత..? సెన్సార్ రిపోర్ట్ ఏంటి..? బుకింగ్స్ ఎలా ఉన్నాయి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.
కుబేర మూవీకి సెన్సార్ బోర్డ్ యు\ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక రన్ టైమ్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి ముందుగా 195 నిమిషాల 27 సెకన్లు రన్ టైమ్ వచ్చింది. అంటే… 3 గంటల 15 నిమిషాల 27 సెకన్లు. ఆతర్వాత 19 సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో రన్ టైమ్ తగ్గించడంతో ఆఖరికి 181 నిమిషాల 46 సెకన్లు రన్ టైమ్ వచ్చింది. అంటే.. 3 గంటల 1 నిమిషం 46 సెకన్లు అన్నమాట. శేఖర్ కమ్ముల తను తీయాలి అనుకున్నది మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తను చూపించాలి అనుకున్న కథ పై కసరత్తు చేయిస్తుంటారు.
కుబేర.. శేఖర్ కమ్ముల తన రూటు మార్చి తీసిన సినిమా. అలాగే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు. అందుకనే ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. ఎవరైనా ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత వీలైనంత ఫాస్ట్ గా సెట్స్ పైకి తీసుకువచ్చేయాలి అనుకుంటారు కానీ.. శేఖర్ కమ్ముల అలా కాదు.. కథ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామంటారు. ఇలా చాలా కసరత్తు తీసిన కుబేర సినిమా ట్రైలర్ అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. అలాగే ఈ మూవీ సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మంచి కథ చెప్పారని ఈ మూవీ మేకర్స్ ని అభినందించారట.
ఇక బుకింగ్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్ సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. గంటకు 12 వేలకు పైగా టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మరింతగా సేల్స్ పెరుగుతున్నాయి. నాగార్జున, ధనుష్, రష్మిక.. ఇలా భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో.. ఈ సినిమాను నిర్మించారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. సెన్సార్ రిపోర్ట్, అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.. ఇక బొమ్మ అదిరింది అనే టాక్ వస్తే కనుక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం. Kuberaa Censor Report..!