మరి నాగ్, వెంకీ మూవీ ఎప్పుడు..?

Nagarjuna And vekatesh Multistarrer: ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ కాలంలో మల్టీస్టారర్ సినిమాలు చాలా వచ్చేవి.. ఆతర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలో కూడా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అయితే.. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. కాలంలో మాత్రం మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. ఈమధ్య కాలంలో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కు మాంచి ఊపొచ్చింది. అలాగే సీనియర్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు.. కీలక పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాగ్ క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా చేయడానికైనా రెడీ అంటున్నాడు. అలాగే వెంకీ కూడా ఇప్పుడు క్యారెక్టర్ నచ్చితే ఎవరితో అయినా సరే నటించేందుకు సై అంటున్నాడు. ఇంతకీ.. వీరిద్దరూ కలిసి నటించే సినిమా ఎప్పుడు..?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్‌, మహేష్ కలిసి నటించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమా రిలీజై సక్సెస్ సాధించినప్పటి నుంచి మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో సీనియర్ హీరో, యంగ్ హీరో కలిసి సినిమా చేయడం అనే ట్రైండ్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించి అసలుసిసలైన మల్టీస్టారర్ మూవీని అందించారు. ఈ సినిమా సంచలనం సృష్టించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. సీనియర్ హీరో వెంకటేష్.. మల్టీస్టారర్ సినిమాలకు ఫస్ట్ నుంచి ఓకే చెబుతుంటారు. సూపర్ స్టార్ మహేష్‌ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చేసిన వెంకీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల అనే సినిమా చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఈ క్రేజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ.. నందమూరి బాలకృష్ణతో కూడా కలిసి నటిస్తుండడం విశేషం. ఇటీవల ఈ న్యూస్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయిపోయింది. Nagarjuna And vekatesh Multistarrer.

చిరు, బాలయ్యలతో వెంకీ సినిమా చేస్తే.. ఇక మిగిలింది కింగ్ నాగార్జున. మరి.. నాగ్ తో వెంకీ కలిసి నటించే సినిమా ఎప్పుడు అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. వీరిద్దరూ కలసి నటిస్తే చూడాలని అక్కినేని – దగ్గుబాటి అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సరైన కథ కుదిరితే ఇద్దరూ కలిసి నటించడానికి రెడీనే. కథ కుదరాలి అంతే. అలా కాకుండా కలిసి నటించేద్దామని ఏదో కథతో సినిమా తీస్తే.. అది ఆకట్టుకోదు. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే.. ఏ రైటర్ అయినా.. డైరెక్టర్ అయినా ఈ ఇద్దరి కోసం కథ రెడీ చేసి ఈ క్రేజీ కాంబో మూవీని అందిస్తాడు అనిపిస్తోంది. మరి.. ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/veeramallu-raises-expectations-with-trailer-these-are-the-highlights-of-veeramallu-movie/