క్రేజీ బ్యానర్ లో నాగ్ సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ కి పండగే !

టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామి రంగ సినిమా తర్వాత ఇంత వరకు సోలో హీరోగా నటించే సినిమాని ప్రకటించలేదు. ఆమధ్య పూరితో నాగ్ సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం నడిచింది కానీ.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ కాలేదు. నాగ్ తో సినిమా చేసే దర్శకులు అంటూ కొంత మంది పేర్లు వార్తల్లో నిలిచాయి కానీ.. ఇంకా ఏ సినిమాను నాగ్ ప్రకటించలేదు. తాజాగా నాగ్.. ఓ క్రేజీ బ్యానర్ లో సినిమా చేయనున్నారనే ఎక్స్ క్లూజీవ్ న్యూస్ తెలిసింది. ఇంతకీ.. ఆ క్రేజీ బ్యానర్ ఏంటి..? ఈ మూవీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు..?

నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగార్జున నటించడం విశేషం. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా శేఖర్ కమ్ముల ఈ సినిమాను సరికొత్తగా తీయడంతో అసలు ఈ కథ ఏంటి..? ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో ధనుష్ బెగ్గర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇక నాగ్ సిన్సియర్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టీజర్ ను బట్టి తెలుస్తుంది. అయితే.. నాగ్ పోలీసాఫీసరా..? లేక అవినీతిని అరికట్టే ఆఫీసరా..? అనేది తెలియాల్సివుంది. ఈ నెల 20న కుబేర మూవీ థియేటర్స్ లోకి రానుంది.

నాగ్ నటిస్తోన్న మరో మూవీ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తుండడంతో కూలీ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. నా సామి రంగ సినిమా తర్వాత నాగ్ చాలా కథలు విన్నారు కానీ.. ఏ కథ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. అందుకనే ఇంత వరకు నాగ్ కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. నాగ్ కొత్త సినిమా గురించి ఎక్స్ క్లూజీవ్ న్యూస్ ఏంటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నాగ్ ఓ సినిమా చేయబోతున్నాడట. అఖిల్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నాయట. అందులో భాగంగానే నాగార్జునతో సినిమా చేయడం కోసం ఓ డైరెక్టర్ ని ఫైనల్ చేశారని.. త్వరలోనే ఆ డైరెక్టర్ నాగ్ కు స్టోరీ నెరేట్ చేయబోతున్నాడని తెలిసింది. మరి.. ఆ డైరెక్టర్ ఎవరో..? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.