నాగ్ ఫాన్స్ కి ఖుషీ న్యూస్.. ఆ రెండు క్రేజీ చిత్రాలు రీ రిలీజ్ కి రెడీ..!

ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తుండడంతో… ఈ పాత మధురాలను థియేటర్స్ లో చూడలేని నేటి యువత ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ ట్రెండ్ కు అనూహ్యమైన స్పందన లభించడంతో పాత సినిమాలకు క్రేజ్ పెరిగింది. సీనియర్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు పాత సినిమాలను కొత్తగా విడుదల చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన రెండు పాత సినిమాలను రీ రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? కొత్తగా ముస్తాబయి థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

నాగార్జున హీరోగా వీరు పోట్ల తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ రగడ. ఈ సినిమాని కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇందులో నాగార్జునను ఫుల్ మాస్ అవతార్ లో కొత్తగా చూపించారు వీరు పోట్ల. దీంతో ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా సీన్స్ కానీ.. సాంగ్స్ కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి కమర్షియల్ సినిమా నాగార్జున ఇప్పుడు చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు.

ఇక నాగ్ నుంచి వస్తోన్న మరో రీ రిలీజ్ మూవీ ఏంటంటే.. శివ. తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రమిది. ఈ సినిమాతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగార్జున. అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే.. శివకు ముందు.. శివకు తర్వాత అని చెబుతుంటారు. అంతలా.. తెలుగు సినిమా పై ప్రభావం చూపించింది.. చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను రీ రిలీజ్ కోసం నాగార్జున అభిమానులే కాదు.. సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇప్పుడు శివ రీ రిలీజ్ కి రెడీ అవుతుందని తెలిసింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రింట్ ను వేరే లెవల్లో ఉండేలా రెడీ చేస్తున్నారట. నాగార్జున నటించిన మాస్, మన్మథుడు, మనం సినిమాలను రీ రిలీజ్ చేస్తే.. అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు అంతకు మించి అనేలా రగడ, శివ సినిమాల రీ రిలీజ్ కు రెస్పాన్స్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఈ రెండు సినిమాల రి రలీజ్ కు సంబంధించిన న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు కూడా కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుండడం విశేషం. మరి.. నాగ్ ఈ రెండు సినిమాల రీ రిలీజ్ లతో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.