ఆ మూవీ రీమేక్ చేయడానికి నాగ్ ఓకే చెప్పారా..?

Nag’s 100th movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమాను త్వరలో ప్రకటించనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ సినిమాకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని రూపిందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు నాగార్జున ఓ రీమేక్ చేయడానికి ఓకే చెప్పారనే వార్త లీకైంది. దీంతో నాగ్ వందో సినిమా కోసం రీమేక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? లేక ఇది వేరే సినిమానా..? అనే సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఏ సినిమాని రీమేక్ చేయనున్నారు..? అసలు నాగ్ ప్లాన్ ఏంటి..?

నాగార్జున 100వ సినిమాని తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించనున్నారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ ప్రెస్టేజీయస్ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను కార్తీక్ కే అప్పగించారు నాగార్జున. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాని నాగార్జున నిర్మించనున్నారు. కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ కి ఎక్స్ పీరియన్స్ ఉందా..? సక్సెస్ లో ఉన్నాడా…? లేదా..? ఇలాంటి లెక్కలు ఏమీ వేసుకోకుండా ఆఫర్స్ ఇస్తుంటారు. అందుకనే కెరీర్ లో మైలురాయి 100వ సినిమాని పెద్ద డైరెక్టర్ కి ఇవ్వకుండా కేవలం ఒక సినిమా తీసిన ఎక్స్ పీరియన్స్ ఉన్న రా కార్తీక్ ఇచ్చారు నాగ్. Nag’s 100th movie.

మరి.. నాగ్ రీమేక్ చేయడానికి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. 100వ సినిమా రీమేకే అంటే కాదు. ఆతర్వాత చేసే సినిమా కోసం రీమేక్ కి ఓకే చెప్పారట. తమిళ్ లో శశి కుమార్ నటించిన అయోతి సినిమా పై నాగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 2023లో రిలీజైన మెలోడ్రామాటిక్ సినిమా ఇది. ఈ సినిమాకి మంత్రిరామూర్తి డైరెక్టర్. ఈ సినిమా కథ.. స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని రీమేక్ చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే.. నాగ్ చేయనున్న ఈ రెండు సినిమాలు కూడా తమిళ్ మేకర్స్ నుంచే వస్తుండడం విశేషం. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 29న ఈ కొత్త సినిమాలను ప్రకటిస్తారని సమాచారం.

కుబేర సినిమాలో దీపక్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత నాగ్ నుంచి వచ్చే సినిమా కూలీ. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమాలో నాగ్ విలన్ పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్ బాబు సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆగష్టు 14న కూలీ సినిమా రిలీజ్ కానుంది. కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన నాగ్.. కూలీతో మరో బ్లాక్ బస్టర్ సాధించనున్నారు. ఇదే స్పీడు కంటిన్యూ చేస్తూ నాగ్ 100వ సినిమా, 101 సినిమాలతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/rajinikanth-coolie-and-ntr-hrithik-war-2-will-recover-the-investments/