
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో ఓ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జక్కన్న రూటు మార్చి చాలా సైలెంట్ గా ఈ సినిమాని షూటింగ్ చేస్తుండడం విశేషం. ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అంటే.. ఇప్పుడు ఎవరైనా రాజమౌళి పేరే చెబుతారు. అలాంటి డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎవరైనా వెంటనే ఓకే చెబుతారు. అయితే.. ఓ స్టార్ మాత్రం నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. అలాగే జక్కన్న సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడంటూ కొత్తగా ఓ స్టార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో నటించేందుకు నో చెప్పిన స్టార్ ఎవరు..? ఎస్ చెప్పిన స్టార్ ఎవరు..?
మహేష్ బాబుతో రాజమౌళి మూవీ గురించి సూపర్ స్టార్ అభిమానులు ఓ పదేళ్ల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పటి నుంచి ఆతృతగా ఎదురు చూస్తుంటే ఇన్నాళ్లకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమధ్య మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ పై షూట్ చేసిన ఒక సీన్ తాలూకు వీడియో లీకైంది. ఇక అక్కడ నుంచి జక్కన్న మరింత కేర్ తీసుకుంటున్నారు.
అయితే.. ఈ సినిమాలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్ ను కాంటాక్ట్ చేశారట. 20 కోట్లు రెమ్యూనరేషన్ ఆపర్ చేసారట. అయినప్పటికీ.. నానా పాటేకర్ ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవల నానా పాటేకర్ హౌస్ ఫుల్ 5 అనే మూవీలో నటించాడు. ఆ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఓ రేంజ్ లో ఉందని.. బూతుల సినిమా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమాలో నానా పాటేకర్ అర్థం పర్థం లేని పాత్ర పోషించాడు. దీంతో అలాంటి అర్థం పర్థంలేని క్యారెక్టర్ చేసి.. ఇప్పుడు అద్భుతమైన రాజమౌళి మూవీలో నటించే ఛాన్స్ వస్తే నో చెబుతావా అంటూ నెటిజనల్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక జక్కన్న మూవీలో నటించేదుకు ఎస్ చెప్పిన స్టార్ ఎవరంటే.. తమిళ స్టార్ మాధవన్ పేరు వినిపిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న నటుల్లో మాధవన్ ఒకడు. ఈ క్రేజీ మూవీలో కీలక పాత్ర కోసం జక్కన్న మాధవన్ ను ఎంపిక చేశారట. జక్కన్న సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేసారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. పాత్ర ఏంటంటే.. మహేష్ మెంటర్ లా కనిపిస్తాడని టాక్. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ఒక్కో స్టార్ ను రంగంలోకి దింపుతున్నారు జక్కన్న. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.