
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ప్యారడైజ్ మూవీని కూడా మార్చి 26న విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో ఒక రోజు గ్యాప్ లో చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ రిలీజ్ కానున్నాయా..? అనేది ఫ్యాన్స్ లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇప్పుడు నాని ప్లాన్ మారిందని.. ప్యారడైజ్ న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. నాని ప్లాన్ మారడానికి కారణం ఏంటి..? ప్యారడైజ్ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు..?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా దసరా. ఈ సినిమా నానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు బాక్సాపీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతోనే ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. ప్యారడైజ్ గ్లింప్స్ అందరికీ షాక్ ఇచ్చాయని చెప్పచ్చు. అంతలా నాని క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నాని అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారట. కారణం ఏంటంటే.. చరణ్ పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. దీనికి కూడా అదిరింది అనేలా రెస్పాన్స్ వచ్చింది.
పెద్ది సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ క్రేజీ మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా షూట్ జరుగుతోంది. సినిమా పై అప్పటి వరకు ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత అమాంతం పెరిగాయి. అందుకనే.. చరణ్ పెద్ది సినిమాతో పోటీపడడం ఇష్టం లేకనే నాని ప్యారడైజ్ మూవీ కోసం కొత్త రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నారని తెలిసింది.
మరో వైపు నాని.. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కూడా శ్రీకాంత్ ఓదెలనే డైరెక్టర్. మెగాస్టార్ తో సినిమాను నిర్మిస్తూ.. తనయుడు రామ్ చరణ్ సినిమాతో పోటీపడడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్ మార్చాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 2026 మార్చి 26న రిలీజ్ చేయాలి అనుకున్న ప్యారడైజ్ సినిమాను 2026లో మే 15న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. అంతా ఫిక్స్ అయిన తర్వాత ప్యారడైజ్ న్యూ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.