బాప్ రే ఇది మాములు న్యూస్ కాదు…హిట్ సిరీస్ లో బాలయ్య..?

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో.. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న సిరీస్ హిట్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే.. ఈ సిరీస్ లో ఏకంగా ఏడు సినిమాలు వస్తాయని.. శైలేష్ చాలా పెద్దగానే ప్లాన్ చేశాడని తెలిసింది. మేటర్ ఏంటంటే.. బాలయ్య కూడా ఈ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. హిట్ 4 ఎప్పుడు..? శైలేష్ కొలను ప్లాన్ ఏంటి..? నిజంగానే బాలయ్య ఈ సిరీస్ లో బాలయ్య ఎంట్రీ ఉంటుందా..?

హిట్, హిట్ 2, హిట్ 3.. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి సక్సెస్ సాధించాయి. నాని ఈ సినిమాలకు నిర్మాత కావడంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. హిట్ 4 లో కోలీవుడ్ స్టార్ కార్తి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు స్టార్ అవుతుంది అంటే.. కాస్త టైమ్ పట్టేలా ఉంది. కారణం ఏంటంటే.. శైలేష్ కొలను హిట్ 4 తీసే ముందు ఓ ఎంటర్ టైనర్ తీయాలని ఫిక్స్ అయ్యాడట. కుదిరితే వెంకీతోనే శైలేష్ మూవీ ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శైలేష్ హిట్ 4 అలాగే ఎంటర్ టైనర్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలిసింది.

ఇదిలా ఉంటే.. హిట్ 5 లో ఎవరు నటిస్తారో హిట్ 4 లో తెలుస్తుంది. ఈసారి బాలయ్యను హిట్ సిరీస్ లోకి తీసుకురావాలని నాని అనుకుంటున్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. దీనికి సంబంధి బాలయ్యని కాంటాక్ట్ చేయడం కూడా జరిగిందని ఇన్ సైడ్ లీక్. అయితే.. బాలయ్య నుంచి ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదట. ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్య కనుక ఈ సిరీస్ లోకి వస్తే.. రేంజ్ మారింత పెరగడం ఖాయం. హిట్ 5లో బాలయ్యతో పాటు నాని కూడా ఉంటాడని.. హిట్ 6లో కూడా ఓ బ‌డా స్టార్ న‌టిస్తాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హిట్ 7 లో ఏడుగురు హీరోలు కనిపిస్తారట. దాంతో హిట్ సిరీస్ క్లోజ్ అవుతుంది. ఇదే కనుక జరిగితే.. ఇలా 7 సినిమాలు సీరిస్ గా రావడం ఇండియన్ స్క్రీన్ పై ఇదే తొలిసారి అవుతుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.