
Nayanthara Deepika Padukone Remuneration: అందాల తారలు నయనతార, దీపికా పడుకునే.. వీరిద్దరిని సినిమాకి ఒప్పించడం.. మామూలు విషయం కాదు. అయితే.. సినిమా చేయడానికి ఒప్పించినా.. ప్రమోషన్స్ కు మాత్రం రారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అండ్ హీరో సినిమా అయినా సరే.. నయన్, దీపికా ప్రమోషనన్స్ కు రారు. అయితే.. ప్రస్తుతం నయన్, దీపికా ఒప్పుకున్న సినిమాల ప్రమోషన్స్ కు ఓకే చెప్పారని తెలిసింది. నయన్ చిరుతో చేస్తోన్న మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. దీపిక కూడా అంతే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. మరి.. నయన్, దీపికను ప్రమోషన్స్ చేసేలా ఎలా ఒప్పించారు. అసలు ఏం జరిగింది..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముస్సోరిలో జరుగుతుంది. చిరంజీవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో చిరుకు జంటగా నయనతార నటిస్తుంది. ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వడానికంటే ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం. దీంతో నయన్ ని ఈ సినిమా ప్రమోషన్స్ కు ఎలా ఒప్పించారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. తెలుగు సినిమా అనే కాదు.. తమిళ సినిమాల ప్రమోషన్స్ కు కూడా నయన్ నో అని చెప్పేస్తుంటుంది. అలాంటిది చిరు, అనిల్ రావిపూడి ప్రమోషన్స్ కు ఎలా ఒప్పించారంటనే… రెమ్యూనరేషన్ తో ఒప్పించారని తెలిసింది.
ఈ సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్స్ కి అదనంగా 2 కోట్లు ఇచ్చారట. అది కేవలం ప్రమోషన్స్ కు మాత్రమే అని తెలుస్తోంది. ఈ రెండు కోట్లు ఇవ్వడంతో ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్పిందట నయన్. దీపిక విషయానికి వస్తే.. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్టర్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాకి దీపిక తీసుకునే రెమ్యూనరేషన్ తో పాటుగా అదనంగా మరి కొంత అమౌంట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. అందుకనే ఈ క్రేజీ మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనేందుకు దీపిక ఓకే చెప్పిందని సమాచారం.
సినిమాలో నటించేందుకు ఒక రెమ్యూనరేషన్.. ఆతర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ చేసేందుకు మరో రెమ్యూనరేషన్. ఇలా ఇస్తే.. ఎంత పెద్ద స్టార్ అయినా.. ప్రమోషన్స్ కు రానని కండీషన్ పెట్టుకున్న హీరోయిన్స్ అయినా సరే.. వెంటనే ఓకే చెబుతున్నారు. ఇదో కొత్త యాపారంలా తయారైంది. ఒకరద్దరు ఇలా చేస్తే.. మిగిలిన హీరోయిన్స్ కూడా ఇలాగే చేయాలి అనుకుంటారు. అయినా.. కథానాయికలు వచ్చి ప్రమోషన్స్ చేస్తే.. జనాలు థియేటర్లకు వచ్చేస్తారా..? వాళ్ల వలన కలెక్షన్స్ పెరుగుతాయా..? ఇదంతా మేకర్స్ ఆలోచించుకోవాలి. మరి.. నయన్, దీపిక ఇన్ స్పిరేషన్ తో ఇంకెంత మంది హీరోయిన్స్ ఇలా ప్రమోషన్స్ కు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారో చూడాలి. Nayanthara Deepika Padukone Charging Extra Remuneration For Promotions..!