నయన్ రెమ్యూనరేషన్ డిమాండ్..అసలు నిజం ఇదే!

అందాల తార నయనతార.. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. లేడీ సూపర్ స్టార్ అనేలా ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ అమ్మడు సినిమా ప్రమోషన్స్ కు రాదు. అయినప్పటికీ.. రెమ్యూనరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తుంటుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం నయన్ ని కాంటాక్ట్ చేస్తే.. భారీగా డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఇంతకీ.. ఎంత డిమాండ్ చేసింది..? ఈ మూవీలో నటిస్తుందా..? లేదా..? అసలు ప్రచారంలో ఉన్న వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ క్రేజీ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆతర్వాత ఈ మూవీ టీమ్ 12 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిందని న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో నయన్ కు 12 కోట్లు రెమ్యూనరేషనా..? అని సాక్ అయ్యారు. ఆతర్వాత ఈ సినిమాలో నయన్, కేథరిన్ ఇద్దరినీ ఫైనల్ చేశారని తెలియడంతో నయన్ కు 12 కోట్లు ఇవ్వడం అనేది నిజమే అంటూ అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. నయనతార కేవలం 6 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకుంటుందట. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది. అనిల్ రావిపూడి.. చెన్నై వెళ్లి నయన్ ను కలిసారు. ఈ మూవీలో నయన్ నటిస్తుందని తెలియచేసేందుకు స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారట. ఈ అనౌన్స్ మెంట్ వీడియో కోసం నయన్ పై షూట్ చేశారని తెలిసింది. ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో కీలకమైన ఎపిసోడ్ తో పాటు ఒక సాంగ్ కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. మరి.. ఈ మూవీతో చిరు, అనిల్ రావిపూడి కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.