
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్… సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “నేను రెడీ” మూవీ టైటిల్, గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ ‘‘నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ ప్రయత్నం ప్రారంభించాను. నా మొదటి చిత్రాన్ని త్రినాథరావు గారి లాంటి పెద్ద దర్శకుడితో ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను రెడీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
హీరో హవీష్ మాట్లాడుతూ ‘‘ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. చాలా మంది నుంచి విశెస్ అందుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్విలా, జీనియస్, సెవెన్ వంటి మూవీస్ తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారి సపోర్ట్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను రెడీ బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ, త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశారు. మిక్కీ గారి మ్యూజిక్, నిజార్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రవీణ్ పూడి గారు కూడా నేను అడగగానే వచ్చి వర్క్ చేశారు. మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ అందరినీ థియేటర్స్ లో కలిసేందుకు వెయిట్ చేస్తున్నా.’’ అన్నారు.
డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ ‘‘కుబేర సినిమా హిట్ కావడం ఇటీవల నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. నెక్స్ట్ రాబోతున్న కన్నప్ప హిట్ కావాలి, ఆ తర్వాత వచ్చే పదీ పదిహేను సినిమాలు హిట్ కావాలి. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాలని కోరుకుంటున్నా. మజాకా కంప్లీట్ అయ్యాక రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ నేను రెడీ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. హవీష్ కు ఈ కథ బాగుంటుందనిపించి కథ చెప్పించాను. ఆయనకు వినగానే నచ్చి, ఈ సినిమా చేద్దామని అన్నారు. అలా నేను రెడీ టేకాఫ్ అయ్యింది. అప్పట్లో పెళ్లిసందడి మూవీలో ఇండస్ట్రీలోని కమెడియన్స్ అంతా నటించారని విన్నాం. నేను రెడీ మూవీలో కూడా ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది. మీరు ఈరోజు వేదిక మీద చూస్తున్నది ఒక ఫ్యామిలీగా నటించిన ఆర్టిస్టులనే. ఇలాంటివి మూడు ఫ్యామిలీలు ఉంటాయి. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్, కుటుంబం మధ్యలో ఉండే సరదాలు, ఎమోషన్స్ ..ఇవే మూవీలో ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నాకు దొరికారు. మిక్కీ గారు చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి చూసేలా హాయిగా ఉంటుంది. ప్రేక్షకులంతా సకుటుంబంగా థియేటర్స్ కు వచ్చి 2.30 గంటలు నవ్వుకుని, చివరి 15 నిమిషాలు ఎమోషన్ ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు. నిఖిల ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. నేను రెడీ హవీష్ గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది.’’ అన్నారు.