తమ్ముడుకు ఏ సర్టిఫికెట్.. టీమ్ ఫీలింగ్ ఏంటంటే ..?

Nithin New Movie Thammudu: సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇస్తానంటే.. అయ్య బాబోయ్ ఏ సర్టిఫికెట్ ఇస్తే ఇంకేమైనా ఉందా..? జనాలు ఫ్యామిలీతో సినిమాకు వస్తారా..? రారు కాక రారు. అందుకనే ఒకప్పుడు ఏ సర్టిఫికెట్ ఇస్తామంటే వద్దని.. మార్పులు చేర్పులు చేసి యు\ఏ సర్టిఫికెట్ కావాలని అడిగేవారు. అదేంటో ఇప్పుడు ఏ సర్టిపికెట్ ఇస్తామంటే.. ఇచ్చేయండి. ఇచ్చేయండి అంటూ తెగ ఆరాటపడుతున్నారు. ఎందుకు అలాగా.. అని ఆలోచిస్తున్నారా..?

ఏ సర్టిఫికెట్ అంటే.. పెద్దలకు మాత్రమే అని అర్థం. ఈ సినిమాను పిల్లలతో చూడకూడదు.. పిల్లలు థియేటర్స్ కి ఈ సినిమా చూడడానికి వస్తే అనుమతించకూడదు. అందుచేత ఈ సర్టిఫికెట్ వస్తే.. నిర్మాతకే నష్టం కానీ.. దీని వెనుక కూడా ఓ స్టాటజీ ఉందట. అందుకనే ఏ సర్టిఫికెట్ వస్తే ఏం పరవాలేదు అంటున్నారు. మేటర్ ఏంటంటే.. ఏ సర్టిఫికెట్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ బోర్ట్ చెబుతున్నా.. పిల్లలు పెద్దలతో ఏ సర్టిఫికెట్ సినిమా హాల్స్ నిండిపోతున్నాయి. వందల కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్, సలార్, ఇటీవల హిట్ అయిన హిట్ 3 సినిమాలకు వచ్చింది ఏ సర్టిపికెట్. అయితే.. ఏ సర్టిఫికెట్ వచ్చిందని తెలిస్తే.. అందులో ఏదో ఉందనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. దీంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

సలార్, యానిమల్ సినిమాలే కాదు.. రెండేళ్ల క్రితం వచ్చిన బేబీ సినిమాకి కూడా ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చూశాం. ఇటీవల శ్రీవిష్ణు సింగిల్ సినిమాకి సైతం ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సరైన సక్సెస్ కోసం చూస్తున్న శ్రీవిష్ణుకు మంచి విజయాన్ని అందించింది. తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకి కూడా ఏ సర్టిఫికెట్ వచ్చింది. అసలు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారంటే.. మితిమీరిన హింస, అభ్యంతరకర కంటెటంట్, బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికెట్ ఇస్తారు. తమ్ముడు సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండకపోవచ్చు కానీ.. యాక్షన్ మాత్రం బాగానే ఉంటుందట. Nithin New Movie Thammudu.

యాక్షన్ కారణంగానే తమ్ముడు సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారని ఇటీవల నిర్మాత దిల్ రాజు బయటపెట్టారు. దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి తమ్ముడు సినిమాలో హింస బాగా ఉంటుందని తెలుస్తోంది. జులై 4న తమ్ముడు సినిమా రిలీజ్ కానుంది. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్ అంటేనే భయపడే నిర్మాతలు ఇప్పుడు ఏ సర్టిపికెట్ వస్తే ఏ ఫరవాలేదు అన్నట్టుగా ఓకే చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. మా సినిమాకి ఏ సర్టిఫికెటే కావాలి అంటున్నారు. దీని వలన ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి. మరి. ఏ సర్టిఫికెట్ సెంటిమెంట్ తమ్ముడుకు కలిసొస్తుందా..? విజయాన్ని అందిస్తుందా..? లేదా..? అనేది చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/bigg-boss-season-9-to-start-soon-star-management-releases-bigg-boss-9-promo/