
Nithin’s latest movie Thammudu: హీరో నితిన్.. ఒకప్పుడు వరుసగా సక్సెస్ చూసాడు. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. తన ప్రతి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు కానీ.. ఫలితం మాత్రం ఆశించినట్టుగా రావడం లేదు. తమ్ముడు సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దిల్ రాజు అయితే.. తమ్ముడు మామూలుగా ఉండదు. ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ తెగ ఇంటర్ వ్యూలు ఇచ్చాడు. పవర్ స్టార్ టైటిల్ పెట్టడంతో ఎలాంటి రిజెల్ట్ వస్తుందో.. ఈ సినిమా అయినా నితిన్ కు సక్సెస్ అందిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో క్రియేట్ చేసింది. అయితే.. తమ్ముడు సినిమా ఏమాత్రం మెప్పించలేదు. అసలు ఏమైంది..? నితిన్ కే ఎందుకు ఇలా జరుగుతోంది..?
జయం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించి యూత్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆతర్వాత దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం, సై చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే.. లవ్ స్టోరీస్ తో యూత్ కి దగ్గరైన నితిన్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి వరుసగా ఫ్లాప్స్ చూశాడు. ధైర్యం, అల్లరి బుల్లోడు, రామ్, టక్కరి, ఆటాడిస్తా.. ఇలా ఓ డజను సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ చూసిన నితిన్ మళ్లీ తన స్ట్రాంగ్త్ తెలుసుకుని ఇష్క్ అనే లవ్ స్టోరీ చేయడంతో ట్రాక్ లో పడ్డాడు. ఆతర్వాత గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు.
ఒక హిట్, ఒక ప్లాప్ అంటూ సాగుతున్న నితిన్ కెరీర్ ఈమధ్య మళ్లీ ట్రాక్ తప్పింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీమేన్, రాబిన్ హుడ్ ఇలా వరుసగా ప్లాప్స్ చూసిన నితిన్ తమ్ముడు సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంటే ఈ సినిమా కూడా నిరాశపరిచింది. అసలు నితిన్ కే ఎందుకు ఇలా జరుగుతోంది..? ఎందుకు సరైన సక్సెస్ సాధించలేకపోతున్నాడు అంటే.. సరైన కథ ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. తమ్ముడు సినిమాతో సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇచ్చారు. పైగా ఈ సినిమా టైటిల్ తమ్ముడు కావడంతో ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది అనుకుంటే.. అది మిస్ అయ్యింది. Nithin’s latest movie Thammudu.
పైగా ఫ్యామిలీ ని అంతా అడవి చుట్టూ తిప్పుతూ ఎమోషన్ పండించాలని డైరెక్టర్ వేణు శ్రీరామ్ ట్రై చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో విలన్ ఎవరో హీరోకి లాస్ట్ వరకు తెలియదు.. హీరో ఎవరో విలన్ కి లాస్ట్ వరకు తెలియదు. అలాగే హీరో, హీరోయిన్ లాస్ట్ వరకు ఒకర్ని ఒకరు చూసుకోరు. ఇలా చెప్పడంతో ఇదేదో కొత్తగా ఉందని హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు ఫీలై ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పుంటారు. అయితే.. ఇదేదో కొత్త పాయింట్ అని వాళ్లు ఫీలైపోయారు కానీ.. ఈ విషయాన్ని ఆడియన్స్ మైండ్ లో ఎక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. ఇలా చెప్పుకుంటే ఈ సినిమాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అందుకే తమ్ముడు నితిన్ కు మరో మరచిపోలేని సినిమాగా నిలిచిపోయింది. పాపం.. నితిన్. ఎప్పుడు ట్రాక్ లో పడతాడో..?