ఎన్టీఆర్ మూవీలో రానా.. ఇది నిజమేనా..?

NTR and Trivikram Mythological: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా భారీ క్రేజీ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవరతో పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అంటూ భారీ యాక్షన్ మూవీతో రానున్నాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ మూవీలో రానా నటించబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో..? రానా క్యారెక్టర్ ఏంటి..? అసలు ఇది నిజమేనా..?

ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాలి. అయితే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తూ బిజీగా ఉండడంతో ఆ కథ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పడం జరిగిందట. ఈ కథ ఎన్టీఆర్ కు ఎంతలా నచ్చిందంటే.. ఈ కథ గురించి… ఇందులోని కార్తికేయుడు గురించి మరింతగా తెలుసుకునేందుకు పుస్తకం చదివేంత. NTR and Trivikram Mythological.

ఇప్పుడు ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా విలన్ గా నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ ఓ స్వామిజీ తరహాలో ఉంటుదట. వెట్టైయాన్ తర్వాత రానా కొత్త సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో అందులోనూ విలన్ పాత్ర చేస్తే వేరే లెవల్లో ఉంటుంది. రానా హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలి అనుకున్నాడు. ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్షన్ లో చేయాలి అనుకున్నప్పటికీ.. ఆతర్వాత ఇది త్రివిక్రమ్ దగ్గరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది. దీనికి సంబంధించిన న్యూస్ బయటకు రాలేదు కానీ.. ఇప్పుడు ఈ వార్త లీకైంది.

ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రానా దగ్గుబాటి విలన్ పాత్ర పోషిస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం. బాహుబలి మూవీలో భళ్లాలదేవగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. ఆతర్వాత కొన్ని కారణాల వలన నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ పై ఎక్కువ కాన్ సన్ ట్రేషన్ చేశాడు రానా. సరైన సినిమా.. సరైన క్యారెక్టర్ చేయాలని చూస్తున్న రానాకు ఎన్టీఆర్ మూవీలో విలన్ పాత్ర పోషించే ఛాన్స్ రావడం అనేది కనుక నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

Also Read: https://www.mega9tv.com/cinema/why-dilraju-keeps-talking-about-game-changer-and-why-did-sirish-apologise-to-mega-fans/