
NTR Neel Dragon Movie: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ డ్రాగన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. అయితే.. ఈ సినిమా కథలో మార్పలు చేర్పులు జరుగుతున్నాయనే వార్త లీకైంది. ఇంతకీ.. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ లో ఛేంజస్ చేయడానికి రీజన్ ఏంటి..?
ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే.. చాలా ఇష్టం. అందుకనే ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా ఈ కథను, ఈ సినిమాలోని క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రప్పా రప్పా అన్నట్టుగా చక చకా కానిచ్చేస్తున్నారు. ఈ స్పీడు చూస్తుంటే.. అనుకున్న టైమ్ కంటే ముందుగానే డ్రాగన్ మూవీని కంప్లీట్ చేస్తారనిపిస్తుంది. అయితే.. ఇటీవల ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారనే ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ డ్రాగన్ గురించి.. డ్రాగన్ స్టోరీ గురించి తెర వెనుక ఏం జరుగుతందో అని ఆరా తీస్తున్నారు.
జనరల్ గా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లాక్ అయి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఛేంజస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడట. అయితే.. ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడట. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా బాగానే ఉంది కానీ.. ఎక్కడో ఏదో మిస్ అయ్యిందనే అసంతృప్తి కలిగింది. ఇంకాస్త కథ పై కసరత్తు చేసుంటే సలార్ రిజల్ట్ వేరేలా ఉండేదనే టాక్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకునే డ్రాగన్ పై మరింతగా వర్క్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ కథ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ ట్రావెల్ అవుతున్నాడు. NTR Neel Dragon Movie.
అందుకనే ఈ కథ గురించి బాగా క్లారిటీ ఉన్న ఎన్టీఆర్ కొన్ని ఛేంజస్ చెప్పాడట. అవి ప్రశాంత్ నీల్ కు బాగా నచ్చడంతో ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు కథ పై మళ్లీ వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంతన్ నటిస్తుంది. ఈసారి సలార్ సినిమాకి వచ్చినట్టుగా ఇంకాస్త వర్క్ చేసుంటే.. ఇంకాస్త బాగా తీసుంటే.. అలాంటి రియాక్షన్ రాకూడదని.. బ్లాక్ బస్టర్ అనేలా టాక్ రావాలని తన రైటర్స్ టీమ్ తో కలిసి రీ వర్క్ చేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర ఆశించిన బ్లాక్ బస్టర్ ఇవ్వలేదనే అసంతృప్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉంది. మరి.. ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తాడేమో చూడాలి.