ఈ మూవీ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్!

NTR Spotted At Mumbai Airport: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమా చేయడానికి కథ పై చాలా కసరత్తు చేయించాడు. ఒకానొక దశలో ఆలస్యం అవుతుండడం వలన ఈ ప్రాజెక్టే లేదనే ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు. వావ్ భలే సినిమాలు సెట్ చేసుకున్నాడే అనిపిస్తోంది. అయితే.. తను చేయనున్న ఓ భారీ, క్రేజీ మూవీ కోసం రీసెర్చ్ చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఎన్టీఆర్ రీసెర్చ్ చేస్తుంది ఏ సినిమా కోసం..? అంతలా రీసెర్చ్ చేయడానికి ఏముంది..?

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక డ్రాగన్ రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా కార్తికేయకు సంబంధించిన కథతో రూపొందనుందని ఓ వార్త బయటకు వచ్చింది. పైగా ఇది పౌరాణిక నేపథ్యంతో రూపొందే సినిమా కావడంతో ఎన్టీఆర్ కరెక్ట్ గా సెట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతలా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే.. ఎన్టీఆర్ చేతిలో మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఆనంద్ బాలసుబ్రహ్మణియన్ రచించారు. ఇది సుబ్రహ్మాణ్యస్వామి గురించి తెలియచేసే పుస్తకం. త్రివిక్రమ్ తో సినిమా చేస్తుండడంతో ఈ క్యారెక్టర్ గురించి మరింతగా తెలుసుకునేందుకే ఈ పుస్తకాన్ని ఎన్టీఆర్ చదువుతున్నాడని తెలిసింది. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నారు. NTR Spotted At Mumbai Airport.

ఎన్టీఆర్ మొదటిసారి పౌరాణిక యోధుడిగా తెరపై కనిపించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి.. మురుగన్ పాత్రలో ఎన్టీఆర్ ఎలా కనబడతాడు అనే క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది..? డైలాగ్స్ ఎలా ఉంటాయి…? కొత్తగా ఏం చూపించనున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగానే టైటిల్ అండ్ టోటల్ టీమ్ వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం వెంకీతో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్ ఇది పూర్తైన తర్వాత ఎన్టీఆర్ తో సినిమాని స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఇప్పటి నుంచే రంగంలోకి దిగాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ram-pothineni-replaces-naga-chaitanya-in-kishore-movie/