వార్ 2 కోసం డ్రాగన్ ఆపేసిన ఎన్టీఆర్..?

NTR stopped the dragon for War 2 Song Shooting: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండడంతో వార్ 2 మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఎన్టీఆర్ డ్రాగన్ స్టార్ట్ చేశాడని వార్తలు వచ్చాయి కానీ.. వార్ 2 ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. ఇప్పుడు వార్ 2 కోసం డ్రాగన్ మూవీ షూటింగ్ ఆపేసాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. వార్ 2 ఎంత వరకు అయ్యింది. వార్ 2 అండ్ డ్రాగన్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి..?

వార్ 2 సినిమాలో ఒక పాట ఉందని.. ఆ పాటను ఎన్టీఆర్, హృతిక్ చిత్రీకరిస్తారని తెలిసింది. అయితే.. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ గా పేరున్న ఎన్టీఆర్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయం. ఈ సాంగ్ ను గతలోనే షూట్ చేయాలి అనుకున్నారు. అయితే.. షూటింగ్ లో హృతిక్ కాలికి గాయాలు అవ్వడం వలన ఈ క్రేజీ సాంగ్ షూట్ చేయకుండా ఆపేసారు. ఇప్పుడు హృతిక్ రోషన్ గాయాలు తగ్గడం.. షూట్ కి రెడీగా ఉండడంతో ఇప్పుడు పాటను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ఈ నెలలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారు.

వార్ 2 మేకర్స్ ఈ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అని చెప్పడంతో.. ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ఆపేసి వార్ 2 సాంగ్ షూట్ కోసం ముంబాయి వెళ్లారని తెలిసింది. త్వరలో డ్యాన్స్ వార్ కు రెడీ అవుతున్నారు హృతిక్ అండ్ తారక్. వార్ పార్ట్ వన్ లో కూడా ఇద్దరు హీరోల పై చిత్రీకరించిన సాంగ్ కీ రోల్ ప్లే చేసింది. దీంతో వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ పై చిత్రీకరించే డ్యాన్స్ స్పెషల్ సాంగ్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట మేకర్స్. దీంతో ఈ మూవీ ఎలా ఉన్నా.. ఇండియా బెస్ట్ డ్యాన్సర్స్ చేసే ఈ సాంగ్ మాత్రం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడం.. థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఈ సాంగ్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆగష్టు 14న థియేటర్స్ లోకి వచ్చేందుకు వార్ 2 రెడీ అవుతోంది. NTR stopped the dragon for War 2 Song Shooting.

డ్రాగన్ మూవీ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చక చకా కానిచ్చేస్తున్నాడు. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు అన్నింటికీ పూర్తిగా డిపరెంట్ గా ఉంటుందట. ఈ మూవీని ముందుగా జనవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే డేట్ కి విజయ్ జన నాయగన్ వస్తుండడంతో ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Also Read: https://www.mega9tv.com/cinema/does-chiru-and-sekhar-kammula-combo-possible-after-kuberaa/