ఎన్టీఆర్ వార్ 2.. షాకింగ్ న్యూస్..!

సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ, క్రేజీ మల్టీస్టారర్ వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమాని అనౌన్స్ చేశారు కానీ.. ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ షాకింగ్ న్యూస్ ఏంటి..? వార్ 2 థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో రెండు పాటలు ఉన్నాయట. ఈ రెండు పాటల్లో ఒక పాటను హృతిక్ రోషన్, కియరా అద్వానీ పై చిత్రీకరించారట. ఈ సాంగ్ లో స్టెప్పులతో హృతిక్, బికినీతో కైరా అద్వానీ అదరగొట్టారని సమాచారం. ఇక రెండో పాటను ఎన్టీఆర్, హృతిక్ పై చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రీతమ్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ పూర్తయ్యింది. కాకపోతే ఇంకా షూట్ చేయలేదు. ఈ సాంగ్ ను ఏడు రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడి డ్యాన్స్ చేసేలా ఈ సాంగ్ ఉంటుందట.

పాటల గురించి తెలిసింది.. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. ఆరు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఇందులో సముద్రం మధ్యలో పడవ పై వచ్చే యాక్షన్ సీన్ హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇది ఎన్టీఆర్ పై చిత్రీకరించిన యాక్షన్ సీన్ అని.. ఇది ఆడియన్స్ లో ఉత్కంఠ కలిగించేలా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఆరు దేశాల్లో 150 రోజులు పాటు షూటింగ్ చేశారు. వచ్చే నెలాఖరుతో షూటింగ్ కి ప్యాకప్ చేయనున్నారు. ఆదిత్య చోప్రా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే… ఆగష్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ క్రేజీ మల్టీస్టారర్ తో ఎన్టీఆర్, హృతిక్ సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.