
Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న క్రేజీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న విశ్వంభర ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. క్వాలిటీ కంటెంట్ అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పై మరింత కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ కారణంగానే మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోన్న విశ్వంభరను అఖండ 2, ఓజీ టెన్షన్ పెడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. విశ్వంభరను ఈ రెండు సినిమాలు టెన్షన్ పెట్టడం ఏంటి..? అసలు ఈ మూడు సినిమాల మధ్య ఏం జరుగుతోంది..?
నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతోన్న అఖండ 2 సినిమాని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. అనుకున్న టైమ్ కి వర్క్ కంప్లీట్ కాదేమో సెప్టెంబర్ 25న అఖండ 2 రావడం కష్టమని ప్రచారం జరిగింది కానీ.. తప్పకుండా వస్తుందని మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ సినిమా పై మరింతగా క్రేజ్ పెంచేసింది. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండడం విశేషం.
సెప్టెంబర్ 25నే వస్తోన్న మరో క్రేజీ మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఫ్యాన్స్ పవన్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తుండడం.. ముఖ్యంగా ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తుండడంతో ఓజీ పై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అని ప్రకటించినా రాదని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇలా ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ మేకర్స్ ఓజీ సెప్టెంబర్ 25న రావడం పక్కా అంటూ క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఓజీ రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి కన్ ఫర్మ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
దీంతో బాలయ్య అఖండ 2, పవన్ ఓజీ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అయితే.. సెప్టెంబర్ 25న విశ్వంభర సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ డేటే విశ్వంభర ఎందుకు కావాలి అనుకుంటుందంటే.. దసరా సీజన్.. బాగా కలిసొస్తుంది. పైగా సెప్టెంబర్ 25 టైమ్ కి ఈ మూవీ వర్క్ కంప్లీట్ అవుతుందట. అదే బెస్ట్ డేట్ అనుకుంటుంది కానీ.. ఆ డేట్ కూడా సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ విధంగా అఖండ 2, ఓజీ విశ్వంభరను టెన్షన్ పెడుతున్నాయి. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా అఖండ 2, ఓజీ సెప్టెంబర్ 25నే వస్తాయా..? లేదా..? విశ్వంభర వచ్చేది ఎప్పుడు.. అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. Vishwambhara Release Date.