జూన్ 6న రాబోతున్న ‘పాడేరు 12వ మైలు’

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్‌గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్‌గా సుహాన హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ… ‘‘నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా, నేను డైరెక్టర్‌గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను. జూన్ 6న థియేటర్స్‌లో విడుదల కానుంది. సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొస్తున్నాం. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన ఈ సినిమా సస్పెన్స్ అండ్ లవ్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ…‘‘పాడేరు 12వ మైలు సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్, యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్‌గా ఉంది. టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా నచ్చుతుందని నమ్మకంగా ఉంది’’ అని అన్నారు.

హైదరాబాద్, వైజాగ్, పాడేరులో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పీఆర్ నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.