చరణ్ తో పవన్ సినిమా.. అసలు నిజం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా రంగంలో హీరో మాత్రమే కాదు.. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్ కొరియోగ్రాఫర్, సాంగ్ కొరియోగ్రాఫర్.. ఇలా వివిధ శాఖలు నిర్వహించారు. అయితే.. పవర్ స్టార్ కు నిర్మాణం అంటే చాలా ఇష్టం. పవన్ క్రియేటీవ్ వర్క్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసారు. వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నారు కానీ.. పాలిటిక్స్ లోకి వెళ్లడం వలన ప్రొడక్షన్ ప్లానింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు బాబాయ్ పవన్.. అబ్బాయ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అసలు.. ఇప్పటి వరకు పవన్ నిర్మించిన సినిమాలు ఏంటి..? చరణ్‌ తో పవన్ సినిమా వెనకున్న నిజం ఏంటి..?

పవన్ కళ్యాణ్‌ కు తెర పై కనిపించడం కంటే.. తెర వెనకుండి వర్క్ చేయడం అంటే మక్కువ ఎక్కువ. అందుకనే హీరోగా నటిస్తున్నప్పటికీ.. కెమెరా వెనుక వర్క్ చేసే డిపార్టెమెంట్స్ గురించి తెలసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఆ ఇంట్రెస్ట్ వలనే రచన, దర్శకత్వం, నిర్మాణం, స్టంట్ కొరియోగ్రపీ, సాంగ్స్ కొరియోగ్రఫీ గురించి తెలుసుకున్నారు. దర్శకత్వం పై ఇష్టంతో జానీ అనే సినిమాను తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన జానీ చిత్రానికి పవన్ కళ్యాణే డైరెక్టర్. ఆ సినిమాతో పవన్ టేస్ట్ ఎలాంటిది అనేది తెలిసింది. అయితే.. అతని పై ఉన్న క్రేజ్ కు.. ఆ సినిమా కథకు మ్యాచ్ కుదరలేదు. అందుకే జానీ ప్లాప్ అయ్యింది.

జానీ సినిమా ప్లాప్ అయ్యిందేమో కానీ.. టెక్నీషియన్ గా పవన్ ఫెయిల్ కాలేదు. ఖుషి సినిమాలో పాటలకు కొరియోగ్రాఫీ అందించారు. అలాగే గుడుంబా శంకర్, పంజా సినిమా పాటలక కూడా కొరియోగ్రఫీ చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాకి వాయిస్ ఓవర్ అందించారు. ఇక స్టంట్ కోర్డినేటర్ గా తమ్ముడు, బద్రి, ఖుషి, గుడుంబా శంకర్, సర్థార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి సినిమాలకు వర్క్ చేశారు. ఇక పవన్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేసి సర్థార్ గబ్బర్ సింగ్, ఛల్ మోహన్ రంగ సినిమాలు నిర్మించారు. కొత్తవాళ్లతో సినిమాలు నిర్మించాలి.. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ను పరిచయం చేయాలి అనుకున్నారు కానీ.. పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత బిజీ అవ్వడం వలన కుదరలేదు.

ఇప్పుడు తన నిర్మాణ సంస్థలో అబ్బాయ్ చరణ్ తో ఓ భారీ చిత్రం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్త వైరల్ అయ్యింది. ఎప్పటి నుంచో చరణ్‌ తో సినిమా నిర్మించాలి అనుకున్నారు పవన్. కొన్ని ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మూవీ ప్లానింగ్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది కానీ.. ఇందులో నిజం లేదని తెలిసింది. చరణ్‌ తో పవన్ నిర్మించే క్రేజీ మూవీకి త్రివిక్రమ్ డైరెక్టర్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ నెక్ట్స్ వెంకటేష్ తో మూవీ, ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు. ఆయన సినిమాలకు సంబంధించి ఏదైనా అఫిషియల్ ప్రకటిస్తానని.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త వాస్తవం కాదన్నారు. అంటే.. చరణ్‌ తో త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ సినిమా అనేది నిజం కాదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు నాగవంశీ. మరి.. ఫ్యూచర్ లో ఈ కాంబో మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.