చరణ్‌ తో గురూజీ సినిమా..? అబ్బాయ్ ని సెట్ చేసింది బాబాయే నా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి 27న ఈ క్రేజీ మూవీ రానుంది. అయితే.. నెక్ట్స్ మూవీని సుకుమార్ తో చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు చరణ్‌ ప్లాన్ మారిందని.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అంతే కాకుండా.. ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వడం వెనుక ఓ స్టార్ హీరో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. చరణ్‌, సుక్కు మూవీ ఏమైంది..? చరణ్‌, త్రివిక్రమ్ మూవీ వెనకున్న స్టార్ ఎవరు..?

చరణ్‌ పెద్ది తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కి పెద్ది షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే.. సుక్కు చరణ్ కు నాలుగు స్టోరీ లైనులు వినిపించాడట. ఏది బాగుంది. ఏ స్టోరీ లైన్ తో సినిమా చేద్దామని అడిగితే.. మీరు ఏది బాగుంటుంది అని చెబితే దానితోనే చేద్దామని మొత్తం బాద్యతను సుకుమార్ కే అప్పించాడట చరణ్‌. అయితే.. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయడానికి తనకి టైమ్ కావాలని.. నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్ లో షూట్ కి వెళ్లాలా ప్లాన్ చేస్తానని సుకుమార్ చెప్పాడట. అయితే.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట చరణ్‌.

ఇలాంటి టైమ్ లో చరణ్‌ కోసం త్రివిక్రమ్ దగ్గర కథ రెడీగా ఉందట. నెక్ట్స్ వీక్ వీరిద్దరి మధ్య మీటింగ్ జరగనుందని తెలిసింది. ఎప్పటి నుంచో చరణ్‌ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. ఇప్పుడు దాదాపు ఈ కాంబో ఫిక్స్ అని తెలిసింది. ఇంతకీ.. ఈ కాంబో సెట్ అవ్వడం వెనకున్న స్టార్ ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. బాబాయ్ పవన్ చెబితే అబ్బాయ్ ఎస్ అనడం తప్పా నో చెప్పారు. ఎందుకంటే.. బాబాయ్ అంటే ఎంతో ఇష్టం. సో.. చరణ్‌, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. మరి.. ఏం జరగనుందో చూడాలి.