
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. అయితే.. ఈ భారీ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించడం.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న వీరమల్లు థియేటర్స్ లోకి వస్తున్నాడు అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు మళ్లీ వాయిదా పడనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా..? అసలు ఏం జరుగుతోంది..?
పొలిటికల్ గా బిజీగా ఉన్న పవర్ స్టార్ సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయి వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే వీరమల్లు షూటింగ్ పూర్తైందో అప్పుడు జూన్ 12న ఈ భారీ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే.. మరో వైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇంకేముంది వీరమల్లు ఇప్పటి వరకు ఆలస్యం అయ్యింది కానీ.. ఈసారి మాత్రం రావడం పక్కా అనుకున్నారు సినీ జనాలు. అయితే.. ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి వీరమల్లు వాయిదా అనే ప్రచారం ఊపందుకుంది.
దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా..? కాదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వాస్తవం ఏంటంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని ఓ వార్త వినిపిస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుంది. హడావిడిగా రిలీజ్ చేయడం కంటే.. మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరో న్యూస్ ఏంటంటే.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని.. ఈ కారణంగానే వీరమల్లు వాయిదా పడడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడడం.. ఐదేళ్లుగా నిర్మాణంలో ఉండడంతో నిజం చెప్పాలంటే.. ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే.. ఇప్పుడేమో పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
వీరమల్లు వాయిదా అంటూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. ప్రచారంలో ఉన్న వార్త నిజమే అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత ఏఎం రత్నం ఈ విషయాన్ని తెలియచేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఒకటి రెండు రోజుల్లోనే నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు రిలీజ్ పై మరోసారి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలిసింది. వీరమల్లు చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే. ఈసారైనా వస్తుంది అనుకుంటే.. వాయిదా అంటూ ఇన్ సైడ్ లీకులు వినిపిస్తున్నాయి. మరి.. వీరమల్లుకు మోక్షం ఎప్పుడో చూడాలి.