రిలీజ్ బరిలో సై అంటున్న పవన్, బాలయ్య..! మరి పోటీకి వచ్చేది ఎవరు..? తగ్గేది ఎవరు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, నట సింహం బాలకృష్ణ.. ఈ ఇద్దరి సినిమాలు పోటీకి సై అంటుండడం.. అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ ఇద్దరి మధ్య సినీ ఇండస్ట్రీ పరంగా, పొలిటికల్ గా మంచి అనుబంధం ఉంది. అయినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య అఖండ 2, పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాలు పోటీపడనున్నాయి అని వార్తలు రావడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రెండు సినిమాల మేకర్స్ తగ్గడం లేదు.. సెప్టెంబర్ 25న రావడం పక్కా అన్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. మరి.. పవన్ ఓజీ, బాలయ్య అఖండ 2 నిజంగా పోటీపడతాయా..? పోటీలో నిలిచేది ఎవరు..? పోటీ నుంచి తగ్గేది ఎవరు..?

బాలయ్య అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. బోయపాటి శ్రీను.. ఈ మూవీని అంతకు మించి అనేట్టుగా బాలయ్యను వేరే లెవల్లో చూపించేలా ఈ స్టోరీని డిజైన్ చేశారట. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి సింహా, లెజెండ్, అఖండ సినిమాలు చేయడం ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో ఈ కాంబోలో మూవీ అంటే బ్లాక్ బస్టరే అనే నమ్మకం అందరిలో ఏర్పడింది. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ అంచనాలకు మించి ఉండడంతో బాలయ్య అభిమానులు అయితే.. పండగ చేసుకుంటున్నారు.

అయితే.. అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 25నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య పోటీ తప్పదా..? లేక లాస్ట్ మినిట్ లో పోటీ నుంచి ఎవరైనా తప్పుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది. గత కొన్ని రోజులుగా అఖండ 2 మూవీ రాదని.. అందుకనే ఓజీ అదే డేట్ కు వచ్చేందుకు రెడీ అయ్యిందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు అఖండ 2 డిసెంబర్ లో వస్తుందని ప్రచారం జరిగింది. ఆతర్వాత డిసెంబర్ లో కాదు.. సంక్రాంతికి అఖండ 2 రావడం ఖాయం అంటున్న న్యూస్ వైరల్ అయ్యింది.

ఇప్పుడు అఖండ 2 సెప్టెంబర్ 25న రానుందని మరోసారి కన్ ఫర్మ్ చేయడంతో పోటీ తప్పదా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..? ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారు అంటే.. ఓజీ మూవీ షూటింగ్ పూర్తయ్యిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్ వర్క్ తక్కువుగా ఉంటుంది. అందుచేత సెప్టెంబర్ 25న ఓజీ రావడం పక్కా అంటున్నారు. ఇక అఖండ 2 దాదాపు షూటింగ్ పూర్తయ్యింది కానీ.. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందట. ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత అఖండ 2 సెప్టెంబర్ 25న రాకపోవచ్చు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. క్లియర్ గా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.