ఉస్తాద్ భగత్ సింగ్.. మాంచి కిక్ ఇచ్చే న్యూస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తోన్న సినిమాలు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడింటిలో వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఓజీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే.. ఆమధ్య ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండదని.. ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టే అని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో.. నిజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని క్యాన్సిల్ చేస్తారేమో అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్యాన్సిల్ కాలేదని తెలిసింది. అంతే కాకుండా ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా న్యూస్..?

పవర్ స్టార్ వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేశారు. ఓజీ సెట్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా కోసం 30 రోజులు డేట్స్ ఇవ్వాల్సివుంది. ఈ రెండు సినిమాలను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న వీరమల్లు మూవీని జూన్ 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. డిసెంబర్ లోపు విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. సుజిత్ డైరెక్షన్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూన్ 12 నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. పవర్ స్టార్ డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో.. హరీష్ శంకర్ షూటింగ్ కు సంబంధించి ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇందులో పవన్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉండేలా హరీష్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి.. గబ్బర్ సింగ్ కాంబో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.