
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ సినీ ఇండస్ట్రీ పై ఫైర్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. ఇదో తుఫాన్ అని చెప్పచ్చు. పవర్ స్టార్ సినీ ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి కావడంతో సినీ పరిశ్రమ పై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అనుకున్నారు. అయితే.. ఆయన ఊహించని విధంగా తనదైన స్టైల్ లో కడిగేశారు. సినిమా వాళ్లకు కృతజ్ఞత అంటూ లేదని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రేంజ్ లో ఫైర్ అవ్వలేదు. అంతలా పవన్ మండిపడ్డారు. ఇండస్ట్రీకి మంచి చేయాలనుకుంటే.. ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా.. మీ రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నాను అన్నారు పవన్. మరి.. పవన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది..? అసలు ఇండస్ట్రీలో పవన్ తుఫాన్ కు వెనకున్న కారణం ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. పవన్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోన్న ఈ టైమ్ లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటూ వార్తలు వచ్చాయి. థియేటర్స్ కు పర్సెంటేజ్ విధానం కావాలని ఎగ్జిబిటర్స్ అంటుంటే.. రెంటల్ విధానం కావాలని నిర్మాతలు అంటున్నారు. తాము కావాలి అంటున్నట్టుగా పర్సెంటేజ్ విధానానికి నిర్మాతలు అంగీకరించకపోతే థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ తీర్మానించడం జరిగింది. ఆతర్వాత జరిగిన పరిణామలు దృష్ట్యా థియేటర్స్ బంద్ లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
అయితే.. వీరమల్లు రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ టైమ్ లోనే థియేటర్స్ బంద్ అనడం వెనుక కుట్ర ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. తన మనసులో మాటలను లేఖ రూపంలో బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారంటే.. మనసులో చాలానే బాధ ఉందని అర్థమౌతోంది. అంతేకాదు.. ఇప్పుడు ప్రభుత్వం అనేక సదుపాయాలు ఇస్తామని చెబుతున్నా.. ఇండస్ట్రీ నుంచి స్పందన లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ గురించి వేరే నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడితే అది వేరు కానీ.. పరిశ్రమతో అనుబంధం ఉన్న పవన్ కళ్యాణే ఇలా మాట్లాడడంతో ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది.
ఇక నుంచి వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదని.. ఎవరైనా తమ సంఘాల ప్రతినిధులతోనే కలవాలన్నారు. ఇండస్ట్రీని ఏపీలో అభివృద్ది చేయాలి అనుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలి అనుకున్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఇలా ఫైర్ అయ్యారు. దీంతో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఏం చేయబోతున్నారు..? సినీ పెద్దలు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఏం చేస్తారు.? పవర్ స్టార్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.