మాట తప్పిన ప్రభాస్…ఎందుకంటే..?

Prabhas Betrayed His Fans: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుసగా సినిమాలు చేస్తూ ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. రెండు మూడు సినిమాలను కన్ పర్మ్ చేస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్నంత స్పీడుగా మరే హీరో కూడా సినిమాలు చేయడం లేదు. అయితే.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులకు ఓ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను ప్రభాస్ తప్పుతున్నాడు. ఇంతకీ.. ప్రభాస్ ఇచ్చిన మాట ఏంటి..? మాట తప్పడానికి కారణం ఏంటి..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ఒక సినిమాకే ఉంటుందని.. ఆతర్వాత ఆ క్రేజ్ ఉండదని.. చాలా మంది కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్, బాలీవుడ్ జనాలు ప్రభాస్ పై కామెంట్స్ చేశారు. అయితే.. వాళ్ల కామెంట్స్ కు తన సినిమాలతో సమాధానం చెబుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. తన సినిమాలకు ఫస్ట్ డేనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తున్నాయంటే.. ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాట ఏంటంటే.. ఇక నుంచి అభిమానుల కోసం సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. అయితే.. ఈ సంవత్సరంలో కన్నప్పలో గెస్ట్ రోల్ చేశారు. అది లెక్కల్లోకి రాదు. ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ప్రభాస్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో నటించిన ఫస్ట్ మూవీ ఇది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ఇయర్ లో ప్రభాస్ నుంచి రాజాసాబ్ ఒక్కటే మూవీ రానుంది. Prabhas Betrayed His Fans.

ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా ఫౌజీ. ఈ సినిమాకి హను రాఘవపూడి డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదొ ఒక డిఫరెంట్ మూవీ. ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ యువకుడిగా, బ్రిటీష్ సైనికుడుగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయనున్నాడు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేస్తారు. 2027లో ఈ మూవీ విడుదల చేయాలి అనేది ప్లాన్. స్పిరిట్ తర్వాత ప్రభాస్ నటించే మూవీ కల్కి 2. ఈ సినిమాను 2028లో రిలీజ్ చేయనున్నారు. ఈ లెక్కన ప్రతి సంవత్సరం ప్రభాస్ నుంచి ఒక సినిమా మాత్రమే రానుంది. దీనిన బట్టి ప్రభాస్ మాట తప్పుతున్నాడు. మరి.. ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటి నుంచో సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/the-4-heroes-who-once-gave-success-have-fallen-behind-flops-in-their-careers/