డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన రాజాసాబ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.. ఈ ఇద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ ది రాజాసాబ్. ఈ సినమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఎప్పుడెప్పుడు రాజాసాబ్ మూవీ గురించి అప్ డేట్ ఇస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రాజాసాబ్ నుంచి అప్ డేట్ వచ్చేసింది. అంతే కాకుండా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే.. ఎలా ఉంటుందో..? ప్రభాస్ ను తన రేంజ్ కి తగ్గట్టుగా డీల్ చేయగలడా..? లేదా..? అనే డౌట్ ఉండేది. అయితే.. ఆమధ్య రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ సినిమా కథ ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. హర్రర్, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతోన్న మూవీ అని మాత్రం తెలిసింది. ప్రభాస్ ఇప్పటి వరకు హర్రర్ జోనర్ లో సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ హర్రర్ జోనర్ లో సినిమా చేస్తుండడం.. అలాగే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తుండడంతో రాజాసాబ్ పై అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఇప్పుడు రాజాసాబ్ నుంచి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మేటర్ ఏంటంటే.. ఈ మూవీ టీజర్ ను జూన్ 16న రిలీజ్ చేయనున్నామని.. ఇక సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని తెలియచేశారు. అలాగే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు హర్రర్ జోనర్ లో రూపొందుతోన్న మూవీ అనే విషయం తెలిసిందే. అయితే.. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఫైట్ చేస్తుండడం.. అందులో డబ్బుల కట్టలు కనిపించడంతో ఇందులో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుందనే కొత్త యాంగిల్ బయటకు వచ్చింది. అభిమానులు కోరుకుంటున్నట్టుగా ప్రభాస్ ను పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు అనే క్లారిటీ కూడా వచ్చింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. దీంతో సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. దసరాకు థియేటర్స్ లోకి రాజాసాబ్ వస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సెప్టెంబర్ కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. డిసెంబర్ 5 అంటే.. చాలా టైమ్ ఉంది. అందుకనే.. డార్లింగ్ ఫ్యాన్స్ రాజాసాబ్ రిలీజ్ డేట్ గురించి బాగా ఫీలవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్ లో ఏప్రిల్ 10న రాజాసాబ్, డిసెంబర్ లో ఫౌజీ రిలీజ్ చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు. ఈ సంవత్సరం ఒక సినిమానే ప్రబాస్ నుంచి రానుంది. మరి.. ఇక నుంచైనా ఇంతకు ముందు చెప్పినట్టుగా సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడేమో చూడాలి.