స్పిరిట్ లో ప్రభాస్ కి అన్ని గెటప్స్ ఉన్నాయా..?

స్పిరిట్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తెలిసిందే. అందుకనే.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ.. ఈ క్రేజీ కాంబోలో మూవీ అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిని బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడనే వార్త బయటకు వచ్చింది కానీ.. అంతకు మంచి కథ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ప్రభాస్ మూడు పాత్రలో కనిపించనున్నాడనే ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇంతకీ.. ప్రభాస్ త్రి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి..?

స్పిరిట్ అనే సినిమా గురించి అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తారని తెలిసింది. అయితే.. పోలీస్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా ఇంకా రెండు క్యారెక్టర్స్ ఉంటాయట. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో ప్రభాస్ మాఫియా డాన్ లా కనిపిస్తాడని.. ఆ ఎపిసోడ్.. మాఫియా డాన్ గా ప్రభాస్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమాలో యాక్షన్ చేశాడు కానీ.. అంతగా ఆకట్టుకోలేదు. ఆతర్వాత చేసిన ఆదిపురుష్‌, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచాయి.

సలార్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ గా కనిపించాడు కానీ.. అసలైన పవర్ ఫుల్ క్యారెక్టర్ సలార్ 2 లో చూపించనున్నారు. కల్కి లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్ గా చూపించారు. కల్కి 2 లో పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. అయితే.. ఫ్యాన్స్ మాత్రం ఊర మాస్ అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను అలాగే ఊర మాస్ అనేలా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఇందులో ప్రభాస్ పోలీస్ గా, మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని తెలిసింది కానీ.. మూడో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సివుంది. ప్రస్తుతానికి ఇది సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి టైమ్ ఎక్కువ దొరకడంతో సందీప్ రెడ్డి వంగ కథ పై బాగా కసరత్తు చేశాడట. ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుందని.. ఎవరు ఎన్ని అంచనాలతో థియేటర్స్ కి వచ్చినా స్పిరిట్ అంతకు మించి అనేలా ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. ప్రభాస్, సందీప్ కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.