ప్రభాస్ తో క్రేజీ డైరెక్టర్ మూవీ ఫిక్స్..?

Prabhas Ties up with Amaran Director: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలకే డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓ క్రేజీ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసిన క్రేజీ డైరెక్టర్ ఎవరు..? ఇంత బిజీలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాది..? అసలు ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఉందా..?

ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో రూపొందిస్తున్న ది రాజాసాబ్ మూవీ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది కానీ.. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఇదోక డిఫరెంట్ మూవీ. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడుగా నటిస్తున్నాడని.. అలాగే బ్రాహ్మణ యువకుడుగా కూడా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నాడు. ప్రభాస్ తో సందీప్ స్పిరిట్ అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్నాడు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం నాగ్ అశ్విన్ కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో కల్కి అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో కల్కి 2 పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ ఇయర్ లోనే కల్కి 2 సెట్స్ పైకి వస్తుందని టాక్. Prabhas Ties up with Amaran Director.

స్పిరిట్, కల్కి 2 తో పాటు సలార్ 2 కూడా వెయిటింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామి ఓ కథ చెప్పాడట. కథ విని ప్రభాస్ ఓకే చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. అయితే.. రాజ్ కుమార్ పెరియాస్వామి ధనుష్ తో కూడా ఓ సినిమా చేయాలి. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నిజంగానే సెట్ అయ్యిందా..? ధనుష్ తో రాజ్ కుమార్ సినిమా పూర్తయ్యే లోపు ప్రభాస్ ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తవుతాయా..? ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరగనుంది అనేది తెలియాల్సివుంది.

Also Read: https://www.mega9tv.com/cinema/hari-hara-veeramallu-trailer-shaking-up-the-youtube-will-veeramallu-be-another-chhaava/