రణ్‌ వీర్ సింగ్ తో సై అంటున్న ప్రభాస్..?

Prabhas vs Ranveer Singh: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ముందుగా ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ది రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే.. మరో భారీ సినిమాని విడుదల చేసేందుకు సాహసం చేయరు కానీ.. రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ మూవీ దురంధర్ ని డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి.. ప్రభాస్ ది రాజాసాబ్ రావడం లేదా..? లేక వచ్చినా పోటీగా రణ్‌ వీర్ సింగ్ దురంధర్ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారా..?

ది రాజాసాబ్ మూవీ పోస్ట్ తర్వాత కొన్ని డేట్స్ అనుకుని ఫైనల్ గా డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని డేట్ లాక్ చేశారు. టీజర్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఆయన సినిమా వస్తుందంటే.. ఏ హీరో పోటీలో ఉండరు. బాహుబలి నుంచి కల్కి వరకు ఇదే జరుగుతూ వస్తోంది. రాజాసాబ్ కు కూడా అలాగే జరుగుతుందని అనుకున్నారు కానీ.. రణ్‌ వీర్ సింగ్ దురంధర్ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు టెర్రిఫిక్ టీజర్ రిలీజ్ చేశారు.

రణ్‌ వీర్ సింగ్ దురంధర్ మూవీని ఆదిత్య ధార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇందులో సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా కనిపిస్తున్నా ఈ సినిమా హై ఇంటెన్స్ డ్రామాగా ఆడియన్స్ ని కట్టిపడేస్తుందని బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. రా ఏజెన్సీ ఏర్పడిన తొలినాళ్లో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారట. అలాగే రియల్ లైఫ్ సంఘటనలు తీసుకున్నారని టాక్. తెలుగు రాష్ట్రాల వరకు సమస్య లేదు కానీ దురంధర్ వల్ల రాజా సాబ్ కు ఇబ్బంది ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటుంది. Prabhas vs Ranveer Singh.

అయితే.. దురంధర్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అని ప్రకటించినప్పుడు ది రాజాసాబ్ మళ్లీ వాయిదాపడిందా అనే డౌట్ అందరిలో స్టార్ట్ అయ్యింది. కారణం ఏంటంటే.. పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంటే.. మరో పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయాలి అనుకోరు. అలా చేస్తున్నారంటే.. ముందుగా ప్రకటించిన సినిమా పోస్ట్ పోన్ అవుతుందని అర్థం. ఈమధ్య కాలంలో ఇలాగే జరిగాయి. దీంతో రాజాసాబ్ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాల్సివుంటుంది. త్వరలో ది రాజాసాబ్ విడుదల పై మరోసారి ప్రకటన ఇస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది. మరి.. నిజంగానే డిసెంబర్ 5న ప్రభాస్ ది రాజాసాబ్, రణ్‌ వీర్ సింగ్ దురంధర్ వస్తాయా..? లేక ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ మార్చుకుంటుందా..? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: https://mega9tv.com/cinema/the-reason-why-mahesh-said-no-to-the-ramayana-movie-ramayana-is-being-made-in-two-parts/