పూరి తో చేతులు కలిపిన రాజమౌళి తండ్రి..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన పూరి.. ఇప్పుడు వరుసగా రెండు డిజాస్టర్స్ ఇచ్చి వెనకబడ్డాడు. ఇక పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు కథలు అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే.. పూరి అంటే.. విజయేంద్రప్రసాద్ కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని చాలా సార్లు.. చాలా ఇంటర్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ను పూరి జగన్నాథ్ కలవడం హాట్ టాపిక్ అయ్యింది. పూరి, విజయేంద్రప్రసాద్ కలిసి సినిమా చేయబోతున్నారా..? అసలు వీరిద్దరూ కలవడానికి కారణం ఏంటి..?

పూరి అంటే.. విజయేంద్రప్రసాద్ కు ఎంతిష్టమంటే.. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతుంటే.. బాధపడేంత. సినిమా తీసేముందు నాకు ఒకసారి కథ చెప్పండి.. ఏదైనా సలహాలు ఇవ్వాల్సి వస్తే.. ఇస్తాను అని చెప్పారంటే.. పూరి అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆయన పాన్ ఇండియా సినిమాలకు కథలు రాస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. అస్సలు టైమ్ ఉండదు. అలాంటి ఆయన పూరి గురించి ఆలోచించి.. ఆయన సినిమాలు ఆడడం లేదని బాధపడి స్క్రిప్ట్ విషయంలో హెల్ప్ చేస్తానన్నారంటే ఎంత ప్రేమ తెలుస్తుంది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ కలిసారు. పూరి టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఫోటోలు కూడా షేర్ చేశారు.

ఇక అక్కడ నుంచి పూరి, విజయేంద్రప్రసాద్ కలవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. పూరి నెక్ట్స్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్ చేశారు. జూన్ నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. లేకపోతే పూరి కెరీర్ ఇక ముగిసినట్టే అంటారు సినీ జనాలు. అందుకనే ఈ సినిమా విషయంలో పూరి విజయేంద్రప్రసాద్ సలహాలు తీసుకోవడం కోసమే కలిసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరో వార్త ఏంటంటే.. పూరి, విజయేంద్రప్రసాద్ కలిసి సినిమా చేయబోతున్నారని.. దీని గురించి చర్చించేందుకు కలిసారనే కూడా టాక్ వినిపిస్తోంది. విజయేంద్రప్రసాద్ కథలో రాజమౌళి సినిమాలు చేశారు. అలాగే కొంత మంది దర్శకులకు కూడా ఆయన కథలు అందించారు. అయితే.. పూరి మాత్రం ఇప్పటి వరకు తన కథలతోనే సినిమాలు తీసారు. ఆయన ఎవరైనా మంచి కథ ఇస్తే.. డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ కథతో పూరి సినిమా చేయడం కోసమే ఇద్దరి మధ్య మీటింగ్ జరిగిందని.. త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్ మెంటు ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే.. తెలుగు సినిమాలో ఈ ఇద్దరి న్యూ క్రియేటీవ్ పార్టనర్ షిప్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.