
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సినిమా గురించి వార్తలు రావడమే కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఇప్పటి వరకు జక్కన్న తను తీసే సినిమాల గురించి కథ ఏంటో చెప్పేసి ఆతర్వాత షూటింగ్ స్టార్ట్ చేసేవారు. అయితే.. ఈ సినిమా విషయంలో మాత్రం కథ ఏంటి అనేది చెప్పకుండా.. అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా షూటింగ్ స్టార్ట్ చేయడం విశేషం. దీంతో మహేష్ 29 సినిమా కథ ఏంటి..? ఎలా ఉండబోతుంది.? అనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లో సైతం క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రామాయణం స్పూర్తితో రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎస్.ఎస్.ఎమ్.బి 29 ఎలా ఉండబోతుంది..?
ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబుతోపాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబర్ స్టార్ ప్రియాంకా చోప్రా, కోలీవుడ్ స్టార్ మాధవన్ నటిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్ ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పారని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీంతో నానా పాటేకర్ మహేష్, రాజమౌళి మూవీకి నో చెప్పి పెద్ద తప్పు చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఎంత పెద్ద రచ్చ జరుగుతున్నా.. జక్కన్న మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.
దీంతో అసలు ఈ మూవీ కథ ఏంటి అని తెలుసుకునేందుకు సినీ అభిమానులు మరింతగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ఈ సినిమా గురించి తాజాగా రామాయణంకు లింక్ ఉందనే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ అడవి నేపథ్యంలో ఉంటుందని.. ఇండియానా జోన్స్ స్పూర్తితో రెడీ చేశామని రైటర్ విజయేంద్రప్రసాద్ ఆ మధ్య ఇంటర్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు రామాయణంకు ఈ సినిమా కథకు లింకు ఉందని వార్తలు వస్తున్నాయి. రామాయణంలో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడుకు తగిలి మూర్చపోతే బ్రతికించడం కోసం సంజీవని తీసుకువస్తాడు హనుమంతుడు. అయితే.. సంజీవిని మూలికలు ఎలా ఉంటాయో తెలియకపోవడంతో హనుమంతుడు ఏకంగా ఆ కొండనే ఎత్తుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడుతాడు.
ఈ పాయింట్ ఆధారంగానే మహేష్ బాబు మూవీని తెరకెక్కిస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ సంజీవిని మూలికలు తీసుకురావడం అనేదే ఈ సినిమాలో ట్విస్ట్ అని.. వాటిని తీసుకువచ్చేందుకే మహేష్ బాబు అడవిలోకి వెళతాడట. ఈ ఎపిసోడ్ ను రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథ లీకైనప్పటి నుంచి ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనే చర్చ మొదలైంది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామారాజు, కొమరం భీమ్ ని కలిపిన జక్కన్న రామాయణంలోని సంజీవని ఎపిసోడ్ స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించడం పెద్ద కష్టమేమి కాదు.. ఇది నిజమే అవ్వచ్చు అని టాక్ నడుస్తోంది. 2027లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి.. త్వరలో జక్కన్న ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.