రాజాసాబ్, అఖండ 2 టార్గెట్ అదే…!

సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను కరెక్ట్ టైమ్ చూసి రిలీజ్ చేయడం అనేది మరో ఎత్తు. ఇప్పుడు సంవత్సరం క్రితమే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నప్పటికీ.. ఆ డేట్ కి సినిమా వస్తుందని గ్యారెంటీ లేదు. ప్రభాస్ రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అని ప్రకటించారు కానీ.. పోస్ట్ పోన్ అయ్యింది. ఇక బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ 25 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదాపడింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ప్రభాస్ రాజాసాబ్, బాలయ్య అఖండ 2 టార్గెట్ ఒకేటే అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ రెండు క్రేజీ సినిమాల టార్గెట్ ఏంటి..?

సమ్మర్ లో భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యాయి. లేటెస్ట్ గా పవర్ స్టార్ ఓజీ, మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర, అడివి శేష్ డెకాయిట్ చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశాయి. అయితే.. ప్రభాస్ ది రాజాసాబ్, బాలయ్య అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అనేది మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు బాలయ్య ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

అయితే.. ఈ రెండు సినిమాల టార్గెట్ డిసెంబర్ అని తెలిసింది. బాలయ్య, బోయపాటిల క్రేజీ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందడం.. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి సక్సెస్ అవ్వడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి బాలయ్య, బోయపాటి పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా సౌండ్ చేయాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం జార్జియాలో బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య పోషించే రెండు క్యారెక్టర్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా బోయపాటి డిజైన్ చేసాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అఖండ సినిమా 2021లో డిసెంబర్ 2న రిలీజైంది. ఇప్పుడు సెంటిమెంట్ గా అఖండ 2 మూవీని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది.

ఇక రాజాసాబ్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఇంత వరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా చేస్తుండడంతో ఆలస్యం అయ్యింది. మారుతి డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ కామెడీ చేస్తుండడంతో రాజాసాబ్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు డిసెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇలా ప్రభాస్ రాజాసాబ్, బాలయ్య అఖండ 2 డిసెంబర్ ఫస్ట్ వీక్ లో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మరి.. ఈ రెండు క్రేజీ సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుందో చూడాలి.