దుమ్మురేపుతున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్. హర్రర్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ది రాజాసాబ్ నుంచి అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈసారి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాదండోయ్.. టీజర్ కూడా రిలీజ్ చేశారు. మరి.. టీజర్ ఎలా ఉంది..? డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

ది రాజాసాబ్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది అభిమానులకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అని చెప్పచ్చు. ఇలా మా అభిమాన కధానాయకుడు ప్రభాస్ ని చూసి ఎన్నాళ్లు అయ్యిందో అంటూ తెగ సంబరపడుతున్నారు ఫ్యాన్స్. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంతో ఈ పోస్టర్ తెగ నచ్చేసింది.

ఇక ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఈ సినిమా పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేసిందని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనగానే.. ఎలా తీస్తాడో.. ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో.. అనే డౌట్ ఉండేది. ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత అనుమానాలు అన్నీ పోయాయని చెప్పచ్చు. ప్రభాస్ లుక్, ఆ విజువల్స్, యాక్షన్.. అవన్నీ చూస్తుంటే.. వావ్ అనిపించింది. దీంతో అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టింది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించింది అనిపించింది.

రాజా సాబ్ సినిమా కోసం వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతోందని మేకర్స్ తెలియచేశారు. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు. హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుందని… చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుందని.. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ తెలియచేశారు. టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతూ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. మరి.. రాజాసాబ్ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.