
కామెడీ హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించాడు.. తన నటనతో కడుపుబ్బా నవ్వించాడు.. నట కిరిటీ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నాడు. తను నవ్వుతూ.. అందర్నీ నవ్వించే రాజేంద్రుడు.. ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాడు. మా రాజేంద్రప్రసాద్.. మమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడని అభినందించిన ఆ జనాలే ఇప్పుడు ఛీ కొడుతున్నారు. రాజేంద్రప్రసాద్ అంటే.. ఎంతో గొప్పోడు.. మంచోడు అనుకున్నామే.. ఇంత సంస్కారహీనుడా..? అని జనాలే అంటున్నారు. ఇంతకీ.. అంతలా జనాలు తిట్టుకునేలా.. రాజేంద్రుడు ఏం చేశాడు..? అసలు ఏమైంది..?
వయసు పెరగడం వలన ఇలా చేస్తున్నాడో.. లేక తనలో ఏదైనా ఫ్రస్టేషన్ ఉందో.. లేక నన్ను గుర్తించడం లేదు.. ఐ వాంట్ గుస గుస అని కోరుకుంటున్నాడో.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలా చేస్తున్నాడో కానీ.. మైక్ దొరికితే చాలు.. ఓవర్ యాక్టింగ్ చేస్తూ.. అడ్డమైన బూతులు తిడుతున్నాడు. ఆ ఆర్టిస్టులతో నాకు అంత చనువు ఉందని చెప్పుకోవాలనే తాపత్రాయం వలనేమో.. స్టేజ్ పై నవ్వించాలని ప్రయత్నించి అభాసుపాలవుతున్నాడు. ఇటీవల రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్ లో వరల్డ్ టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఓరేయ్ వార్నర్ గా అనేసాడు. ఆయనతో కలిసి రాబిన్ హుడ్ మూవీలో నటించి ఉండచ్చు. పైగా వాడికి తెలుగు రాదులే అనడం మరొక తప్పు. జనం చూస్తున్నారు.. ఇలా మాట్లాడకూడదు అనే కామన్ సెన్స్ లేకుండా తిడతారా..? ఆతర్వాత తప్పు తెలుసుకున్న రాజేంద్రుడు ఇక నుంచి అలా మాట్లాడను అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా అవార్డు అందుకోవడం తెలిసిందే. ఆ టైమ్ లో ఈ రాజేంద్రుడు కలప దొంగకు నేషనల్ అవార్డ్.. అదో సినిమానా అంటూ కామెంట్ చేశాడు. ఆతర్వాత ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. సీనియర్ ఆర్టిస్టు.. స్టేజ్ పై హుందాగా మాట్లాడాలనే జ్ఞానం లేకండా అజ్ఞానమో.. అహంకారమో కానీ.. నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు. ఫిల్మ్ నగర్ క్లబ్ లో దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లోను ఇలాగే మాట్లాడి అభాసు పాలయ్యాడు. ఇక ఆయన స్టేజ్ ఎక్కితే.. ఏదో నవ్వించాలనో.. లేకపోతే అక్కడున్న వాళ్లతో ఎంతో చనువు ఉందని చెప్పాలనుకుంటాడో కానీ.. భరించలేని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. అచ్చెన్న ఇంత మంది వస్తున్నారని ముందే ఎందుకు చెప్పలేదు. బయట చూసుకుందాం నీ సంగతి చెబుతా నీకు ఉందిలే అంటూ.. పళ్ళు కొరుకుతూ ఏదో చేశాడు. ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకో అర్థం కాదు.
ఇక అలీని చూసి.. ఒరేయ్ అలీ రారా.. అని రాయడానికి వీలులేని మాట అనేశాడు. ఒక్క క్షణం అక్కడున్న వారికి అర్ధం కాలేదు. ఏంటి అంత మాట అనేశాడని.. ఆలీ నవ్వుతూ ఈజీగా తీసుకున్నాడు. అప్పుడు సీనియర్ హీరోయిన్ రోజా వస్తే.. రోజానా.. దాన్ని నేనే హీరోయిన్ చేశాను అని లూజ్ గా అనేశారు. సీనియర్ యాక్టర్.. అది కూడా స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు.. మీడియాను పిలిచినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుంది కానీ..నట కిరీటి ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నాడు.ఎన్టీఆర్ అవార్డు అందుకున్నాను అనగానే చప్పట్లు కొట్టాల.. ఆయన అన్న మాట. చప్పట్లు కొట్టకపోతే సిగ్గు శరం లేనట్లే అంటూ మరోసారి నోరు జారాడు.
ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న రాజేంద్రుడు గురించి మీడియా రాస్తే.. కోపం వచ్చినట్టుంది. షష్టిపూర్తి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. నేను ఇంతే.. ఇలాగే మాట్లాడతాను.. అర్థం చేసుకోకపోతే మీ ఖర్మ అంటూ మీడియాదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు.. స్టేజ్ పై హుందాగా మాట్లాడాలనే విషయం తెలియకపోవడానికి ఆయనేమి చిన్నపిల్లాడు కాదు.. చిన్న పిల్లలకు సైతం అందరిలో మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని తెలుస్తుంది కానీ.. ఈయనకు మాత్రం తెలియడం లేదు. అందుకనే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు పొగొట్టుకుంటున్నాడు.. పాపం..నాడు ఎంతగానో నవ్వించిన ఈ రాజేంద్రుడు ఇప్పుడు తెగ నవ్వులపాలవుతున్నాడు. మరి తను చేస్తున్న తప్పులని ఈ నట కిరీటి ఎప్పుడు తెలుసుకుంటాడో.. ఎప్పుడు మారతాడో చూడాలి..?