కూలీ, వార్ 2.. పెట్టుబడి తిరిగి వచ్చేనా..?

Coolie And War 2: సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ల కాంబోలో రూపొందిన భారీ క్రేజీ మూవీ కూలీ. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున ఆగష్టు 14న రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం. దీంతో ఈ రెండు సినిమాల పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ రెండు సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ రేటుకు దక్కించుకున్నారు. దీంతో తెలుగు స్టేట్స్ లో కూలీ, వార్ 2 చిత్రాల పెట్టుబడి రికవరీ అవుతుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఈ రెండు సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఎంత దక్కించుకున్నారు..? రికవరీ సాధ్యమేనా..?

కూలీ, వార్ 2 ఈ రెండు సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తం చెల్లించారు. దిల్ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, సురేష్ బాబు.. ఈ ముగ్గురు కలిసి 42 కోట్ల రూపాయలతో కూలీ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి తెలుగు రాష్ట్రాల్లో కూలీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ భారీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 90 కోట్లు వసూలు చేయాలి. రజనీకాంత్ బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు కానీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 కూడా అదే రోజున విడుదల అవుతుండడంతో ఈ సినిమా ప్రభావం కూలీ కలెక్షన్స్ పై పడడం ఖాయం. Coolie And War 2.

వార్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగవంశీ దక్కించుకున్నారు. ఈ మూవీ మేకర్స్ తెలుగు రైట్స్ కోసం 100 కోట్లు డిమాండ్ చేశారట. అయితే.. అంత ఇవ్వలేదు కానీ.. 85 నుంచి 90 కోట్ల మధ్యలో డీల్ క్లోజ్ అయ్యిందని తెలిసింది. ఈ సినిమా టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో అయితే పెద్ద ట్రోలింగే నడిచింది. దీంతో వార్ 2 సినిమా పై కూలీ సినిమాకి ఉన్నంత బజ్ అయితే లేదు అనేది వాస్తవం. దీంతో వార్ 2 సినిమాని అంత పెట్టి కొనడం అనేది రిస్కే అనే మాట గట్టిగా వినిపిస్తోంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఇప్పటి నుంచే భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ జైలర్ 2 షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే.. రెండు పాన్ ఇండియా సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయడానికి ఎవరూ అంతగా ఇష్టపడరు. ఇలా చేస్తే.. రెండు సినిమాలకు ఇబ్బందే. రెండు సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ తగ్గదేలే అన్నట్టుగా పోటీపడి రెండు సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు మేకర్స్. ఇక్కడ ఏ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ఆ సినిమానే భారీ విజయం సాధిస్తుంది. ఏమాత్రం టాక్ తేడా వచ్చినా.. నష్టాలు తప్పవు. మరి.. ఈ రెండు సినిమాలు ఎంత వరకు మెప్పిస్తాయో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి రికవరీ అవుతుందో లేదో తెలియాలంటే ఆగష్టు 14 వరుకు ఆగాల్సిందే.