దటీజ్ చెర్రీ.. మాట ఇస్తే చేస్తాడంతే!

Ram Charan Jani Master: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం.. ఆతర్వాత అరెస్ట్ అవ్వడం.. బెయిల్ పై విడుదల అవ్వడం తెలిసిందే. ఒప్పుడు బిజీగా అస్సలు ఖాళీ లేకుండా ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడట. పుష్ప 2 సినిమాకి కొరియోగ్రఫీ చేయాల్సింది కానీ.. అరెస్ట్ నేపధ్యంలో ఛాన్స్ మిస్ అయ్యాడు. అయితే.. ఇప్పుడు జానీ మాస్టర్ కు బడా స్టార్ ఛాన్స్ ఇచ్చారని తెలిసింది. ఇంతకీ.. జానీ మాస్టర్ కు ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ ఎవరు..?

జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత తనకు కొంత మంది స్టార్స్ ఫోన్ చేశారని.. ఛాన్స్ ఇస్తానని చెప్పారని.. మీడియాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పినట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. మెగా హీరోలతో ముఖ్యంగా రామ్ చరణ్‌ తో జానీ మాస్టర్ కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే జైలు నుంచి విడుదల అయిన తర్వాత జానీ మాస్టర్ కు స్వయంగా చరణ్‌ ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని.. తన సినిమాకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

ఇప్పుడు చరణ్‌ నటిస్తున్న పెద్ది సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడని న్యూస్ లీకైంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్‌ నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ జెడ్ స్పీడుతో జరుగుతుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను జానీ మాస్టరకు ఇచ్చారట. గతంలో చరణ్‌ నటించిన రంగస్థలం, బ్రూస్ లీ, ఎవడు చిత్రాల్లోని సూపర్ హిట్స్ సాంగ్స్ కు జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. అయితే.. జానీ మాస్టర్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇండస్ట్రీ దూరం పెట్టిందని గుసగుసలు వినిపించాయి. ఈమధ్య జానీ మాస్టర్ ఒక్క సాంగ్ కు కూడా కొరియోగ్రఫీ చేయకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి. Ram Charan Jani Master.

అయితే.. ఇప్పుడు జానీ మాస్టర్ కు చరణ్‌ ఛాన్స్ ఇవ్వడం అనేది బిగ్ ఆపర్చునిటీ. దీనిని సదిన్వియోగం చేసుకోవాలని తపిస్తున్నాడట. ఈ సాంగ్ కొరియోగ్రఫీ గురించి అదరూ మాట్లాడుకునేలా సాంగ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నాడట. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మార్చి 27న ఈ భారీ పాన్ ఇండియా మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Also Read: https://www.mega9tv.com/cinema/coolie-title-has-been-changed-in-hindi-due-to-some-backlashes-and-the-title-named-as-majadoor/