సోషల్ మీడియాలో వైరలైన చరణ్‌ బిగ్ స్టేట్మెంట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీకి బుచ్చిబాబు డైరెక్టర్. ఈ మూవీ కోసం బుచ్చిబాబు మూడేళ్లు వెయిట్ చేసాడు. ఇక షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా స్పీడుగా వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఏ సినిమా గురించైనా అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. అదిరిపోతుందని.. నిర్మాతలు లేదా దర్శకులు స్టేట్మెంట్ ఇస్తుంటారు.. హీరోలు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈసారి చరణ్ పెద్ది గురించి చెప్పిన మాటలు అంచనాలు మరింతగా పెంచాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ.. పెద్ది గురించి చరణ్‌ ఏం చెప్పాడు…?

రామ్ చరణ్‌ ఇటీవల తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మెగా అభిమానులను చరణ్‌ కలిసాడు. పెద్ది సినిమాలో చరణ్‌ క్రికెటర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గ్లింప్స్ లో బ్యాట్ తో వెరైటీగా కొట్టే షాట్ ఏదైతే ఉందో అది మాత్రం జనాలకు బాగా నచ్చేసింది. స్టార్ క్రికెటర్స్ సైతం పెద్ది కొట్టిన షాట్ ను రీ క్రియేట్ చేస్తున్నారంటే.. ఎంతలా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే చరణ్‌ లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఫ్యాన్స్ చరణ్ కు బ్యాట్ బహుకరించారు.

ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన చరణ్ ఇప్పటి వరకు పెద్ది సినిమా 30 శాతం షూటింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. ఇదే సందర్భంగా మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించాడు. అది ఏంటంటే… రంగస్థలం సినిమా కంటే పెద్ది రెట్టింపు బెటర్ గా ఉంటుంది అన్నాడు. ఇలా తన సినిమా గురించి చాలా గొప్పగా చెప్పకొచ్చాడు చరణ్. గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. అందుకనే అంత టైమ్ తీసుకోకుండా పెద్ది సినిమాని రికార్డ్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇంకా చెప్పాలంటే.. ఈ సంవత్సరం చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నాడని తెలిసింది. ఇలా పెద్ది రంగస్థలం చిత్రానికి రెట్టింపు ఉంటుందని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో దీని గురించే డిష్కసన్ జరుగుతోంది. మరి.. చరణ్‌ నమ్మకం ఎంత వరకు నిజమౌతుందో చూడాలి.