
Ram Pothineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం.. 100 కోట్ల క్లబ్ లో చేరడం.. తెలిసిందే. దీంతో చైతూ నెక్ట్స్ సినిమాల పై మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అయితే.. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు చైతూ చేయాల్సిన ప్రాజెక్ట్ వేరే హీరో చేయబోతున్నాడని ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఏంటా ప్రాజెక్ట్..? ఎవరా హీరో..?
అక్కినేని నాగచైతన్య కొత్త దర్శకుడు కిషోర్ తో సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇది హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అని.. ఈ భారీ చిత్రాన్ని బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్ బలంగా వినిపించింది. ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే.. ఫైనల్ నెరేషన్ విన్న చైతన్య ఈ కథకు నో చెప్పారని తెలిసింది. దీంతో కిషోర్ అనే ఈ కొత్త దర్శకుడు ఈ కథను మరో హీరోకి చెప్పి ఓప్పించాడట. ఇది లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఇంతకీ.. చైతూ నో చెప్పిన ఈ కథను డైరెక్టర్ కిషోర్ హీరో రామ్ కు చెప్పాడట. ఈ కథ విని రామ్ ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందట. అందుకనే.. కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథతో సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కొత్తగా ఉంటుందట. అయితే.. చైతన్యకు హర్రర్ సినిమాలంటే నచ్చవ్. అందుకనే నో చెప్పి ఉంటాడని టాక్. Ram Pothineni Naga Chaitanya.
కిషోర్ చెప్పిన కథకు నో చెప్పిన చైతూ.. శివ నిర్వాణ చెప్పిన కథకు ఓకే చెప్పాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. గతంలో చైతూతో మజిలీ అనే సినిమా తెరకెక్కించాడు. ఈసారి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ చూపించబోతున్నాడని తెలిసింది. తండేల్ సినిమాతో చైతూ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక నుంచి కథల విషయంలో మరింత కేర్ తీసుకోవాలని.. ఈ సక్సెస్ ని కంటిన్యూ చేసేలా కథలు ఎంచుకోవాలని తపిస్తున్నాడు. అందుకనే మొహమాటానికి సినిమాలు ఒప్పుకోవడం లేదు. మరి.. చైతూ స్టోరీ సెలక్షన్స్ ప్లానింగ్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/rashmika-in-anushkas-footsteps-will-her-plan-work-with-mysaa/