అనుష్క రూటులో రష్మిక. ప్లాన్ ఫలించేనా..?

Rashmika And Anushka: అందాల తార అనుష్క కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు అరుంథతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే.. ఇప్పుడు వరుస విజయాలతో కెరీర్ లో దూసుకెళుతుంది నేషనల్ క్రష్ రష్మిక. తను సినిమాలో నటించిందంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనేలా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు కూడా అనుష్క బాటలోనే నడుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అనుష్క బాటలో రష్మిక ఏం చేస్తుంది..? మరి.. రష్మిక ప్లాన్ ఫలించేనా..?

అనుష్క కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అరుంథతి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేసింది. ఆ సినిమా అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. దీంతో అనుష్క కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అయితే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినప్పటికీ.. కమర్షియల్ సినిమాలను వదులుకోలేదు. ఓ వైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే.. మరో వైపు పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. ఇలా కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసింది. అందుకనే.. అనుష్క కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి. పర్ ఫార్మెన్స్ సక్సెస్ ఫుల్ మూవీస్ కూడా ఉన్నాయి. Rashmika And Anushka.

ఇప్పుడు రష్మిక కూడా అనుష్క బాటలోనే నడుస్తూ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెట్ మూవీస్ చేస్తుంది. పుష్ప 2, యానిమల్, చావా, కుబేర.. ఇలా రష్మిక నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే పేరు తెచ్చుకుంది. అయితే.. ఇంతలా టాలీవుడ్, బాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసకున్న ఈ బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి సై అంటుంది. కథ నచ్చితే ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫెయిల్యూర్ లో ఉన్నాడా..? అనేది కూడా చూడడం లేదు. సినిమా చేయడానికి ఓకే చెబుతుంది.

తాజాగా రష్మిక మైసా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో చాలా వయోలెంట్ గా ఉన్న క్యారెక్టర్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన డీటైల్స్ ఎక్కువుగా రివీల్ చేయలేదు. అయితే.. తనకు పరిచయం లేని కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ సినిమాకి రవీంద్ర పూలే డైరెక్టర్. గతంలో ఈ డైరెక్టర్ అర్థ శతాబ్ధం అనే సినిమా చేశాడు. దీనికి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. పూర్తిగా ఇది షాకింగ్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది. ఐదు భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. అనుష్క బాటలో నడుస్తున్న రష్మిక.. అనుష్క వలే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో సక్సెస్ సాదిస్తుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ram-charan-gave-chance-to-jani-master-for-a-song-choreography-in-peddi/