ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ తనేనా..?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పట్టాలెక్కిన ఈ క్రేజీ మూవీ బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంతన్ నటిస్తుంది. అయితే.. ఈ సినిమాలో శృతి హాసన్ తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక పేరు వినిపిస్తోంది. దీంతో ఈ భారీ పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించేది శృతి హాసనా..? రష్మికనా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీలో స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరు..?

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీలో శృతి హాసన్ కథానాయికగా నటించడం తెలిసిందే. సలార్ పార్ట్ 1 లో శృతి హాసన్ కు పాత్ర నిడివి తక్కువే ఉంది. అయితే.. సలార్ 2 లో మాత్రం శృతి పాత్ర ఎక్కువుగా ఉంటుందట. ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ పూర్తైన తర్వాత సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తోన్న డ్రాగన్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ స్పెషల్ సాంగ్ కోసం శృతిని కాంటాక్ట్ చేస్తే.. ఓకే చెప్పిందని ఈ సాంగ్ ను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపించింది.

అయితే.. శృతి వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వలన కుదరలేదో ఏమో కానీ.. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మికను కాంటాక్ట్ చేశారనే వార్త లీకైంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ను గ్రాండ్ గా.. సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారట నీల్. ఆ పాట సెకండాఫ్ లో వస్తుందట. ఈ సాంగ్ కోసం రష్మిక సంప్రదిస్తే.. ఓకే చెప్పింది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. పాన్ ఇండియా సినిమాలతో రష్మిక కెరీర్ లో దూసుకెళుతుంది. మరి.. ఇంత బిజీలో కూడా స్పెషల్ సాంగ్ కి నిజంగానే ఓకే చెప్పిందా అనేది తెలియాల్సివుంది.