
Rockstar Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అనగానే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఆయన మ్యూజిక్ అందిస్తున్నారంటే.. ఆ పాటల కోసమైనా సినిమా చూడాలి అనిపిస్తుంది. అందుకనే.. టాప్ డైరెక్టర్స్ అండ్ టాప్ హీరోలు ఆయనతో మ్యూజిక్ చేయించుకోవాలి అనుకుంటారు. ఆమధ్య చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాక్ స్టార్ దేవశ్రీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి దేవిశ్రీ కామెంట్స్ వార్తల్లో నిలిచాయి. ఇంతకీ.. ఈసారి ఏమన్నాడు..? దేవిశ్రీ మాటల వెనకున్న మర్మం ఏంటి..? అసలు ఏం జరిగింది..?
కుబేర సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఫస్ట్ టైమ్ శేఖర్ కమ్ముల, దేవిశ్రీప్రసాద్ కలిసి పని చేయడంతో ఈసారి దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో అని ఎదురు చూసిన జనాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విషయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పచ్చు. ఆడియన్స్, మీడియా కుబేర సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభినందించారు. థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులతో రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకెళుతుంది.
ఈ సినిమా సక్సెస్ సందర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. నా రెమ్యూనరేషన్ సినిమా రిలీజ్ కి ముందే క్లియర్ చేశారు. అంతే కాకుండా.. మ్యూజిక్ బాగుందని కూడా అభినందించారు అని చెప్పాడు. అంతకంటే ఇంకేమి కావాలి అంటూ దేవిశ్రీ స్టేజ్ పై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. అంతలోనే యాంకర్ ప్రొడ్యూసర్ సునీల్ గారు సక్సెస్ మీట్ లో మాట్లాడతా అన్నారు. దేవిశ్రీ గారు మీరు మాట్లాడించాలి అనగానే.. పేమెంట్ ఇస్తానని బాకీ పెట్టడం కంటే.. మాట్లాడతానని బాకీ పెట్టడం మంచిదే అన్నారు. Rockstar Devi Sri Prasad.
దేవిశ్రీ ఇలా అన్న తర్వాత నుంచి ఆయన చేసిన కామెంట్స్ ఎవరి గురించి అనే చర్చ మొదలైంది. ఆయనకు పేమెంట్ బాకీ పెట్టింది ఎవరు..? ఎవరా నిర్మాత..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆయన మాట్లాడింది.. మైత్రీ మూవీ మేకర్స్ గురించేనా..? పుష్ప 2 సినిమాకి దేవిశ్రప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. లాస్ట్ మినిట్ లో వేరే డైరెక్టర్స్ ని తీసుకుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించారు. ఫైనల్ గా దేవిశ్రీ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే ఉంచారు కానీ.. ఆ టైమ్ మైత్రీ నిర్మాతలకు దేవిశ్రీకు విభేదాలు వచ్చాయని టాక్ వినిపించింది. ఇప్పుడు రాక్ స్టార్ ఇలా మాట్లాడడం బట్టి మైత్రీ నిర్మాతల గురించే ఇన్ డైరెక్ట్ గా మాట్లాడాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై రాక్ స్టార్ రియాక్ట్ అవుతాడేమో చూడాలి.