
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఇంత వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. త్వరలో వెంకీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమాని త్వరలో పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ హీరోయిన్ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఎన్టీఆర్ మూవీ మేకర్స్ ఆ హీరోయిన్ కి కండీషన్ పెట్టారనేది లీకైంది. ఇంతకీ.. ఆ కండీషన్ ఏంటి..? నిజంగానే వెంకీ, ప్రభాస్ సినిమాల్లో నటిస్తుందా..? లేక ఇది గాసిప్పా..? అసలు ఏం జరిగింది..?
విక్టరీ వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో కథనాయిక పాత్ర కోసం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీలో నటిస్తున్న రుక్మిణి వసంత్ ను కాంటాక్ట్ చేశారట. ఈ అమ్మడుకు త్రివిక్రమ్ కథ చెప్పడం జరిగింది.. కథ.. అందులోని ఆమె క్యారెక్టర్ బాగా నచ్చాయట. అయితే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఏ సినిమాలో నటించకూడదు అనే కండీషన్ పెట్టారట. దీనికి రుక్మిణి ఓకే చెప్పిందట. ఇప్పుడు అనుకోకుండా వెంకీ, త్రివిక్రమ్ మూవీలో నటించే ఆఫర్ వచ్చిందట.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్ మూవీలో కూడా నటించే ఛాన్స్ వచ్చిందట. దీపికా పడుకునే పెట్టిన కండీషన్స్ సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదట. రోజుకో కండీషన్స్ పెట్టడం వలన ఆమెనే ప్రాజెక్ట్ నుంచి తీసేసారని సమాచారం. దీంతో సందీప్.. రుక్మిణి వసంత్ ను కాంటాక్ట్ చేశారని.. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రుక్మిణి వసంత్ కు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటించే ఛాన్స్ రావడం ఓ విశేషం అయితే.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఈ ముద్దుగుమ్మకు వరుసగా క్రేజీ ఆఫర్స్ రావడం మరో విశేషం. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా వెంకీ, ప్రభాస్ చిత్రాల్లో రుక్మిణి నటిస్తే.. ఆమెకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.